Home /News /sports /

TOM MOODY DESIRES TO REPLACE RAVI SHASTRI AS INDIA COACH AN AUSTRALIAN SPORTS WEBSITE REPORT JNK

Team India Coach: టీమ్ ఇండియాకు కోచ్‌గా రావాలనుకుంటున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. గతంలో మంచి రికార్డు

టీమ్ ఇండియా కొత్త కోచ్ రేసులో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ (PC: BCCI)

టీమ్ ఇండియా కొత్త కోచ్ రేసులో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ (PC: BCCI)

Team India Coach: టీమ్ ఇండియాకు కొత్త కోచ్‌గా విదేశీయుడిని నియమించే అవకాశం ఉన్నది. బీసీసీఐ నుంచి ఇప్పటికే ఈ మేరకు లీకులు వచ్చాయి. కాగా, కొత్త కోచ్ రేసులో ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ముందంజలో ఉన్నట్లు తెలుస్తున్నది.

    టీమ్ ఇండియా (team India) పురుషుల జట్టు హెడ్‌ కోచ్‌గా (Head Coach) ఉన్న రవిశాస్త్రి (Ravi Shastri) టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తర్వాత పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ రవిశాస్త్రి అండ్ కో టీ20 వరల్డ్ కప్‌ తర్వాత దిగిపోతుండటంతో.. కొత్త కోచ్ కోసం బీసీసీఐ (BCCI) అన్వేషణ మొదలు పెట్టింది. తొలుత రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వస్తాడనే రూమర్లు వచ్చాయి. కానీ ద్రవిడ్ ఆ పదవి చేపట్టడానికి బదులు నేషనల్ క్రికెట్ అకాడమీ డైరక్టర్‌గా కొనసాగడానికే ఆసక్తి చూపించాడు. ఇక అనిల్ కుంబ్లేను కోచ్ పదవికి ఎంపిక చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్రంగా ప్రయత్నించాడు. తనకు ఇష్టమైన కుంబ్లే ఆ పదవిలో ఉండాలని గంగూలీ కోరుకున్నాడు. అయితే అనిల్ కుంబ్లే తిరిగి టీమ్ ఇండియా కోచ్ పదవి చేపట్టడానికి సుముఖంగా లేడు. అంతే కాకుండా బీసీసీఐ కూడా అనిల్ కుంబ్లేను తిరిగి ఆ పదవికి ఎంపిక చేయాలనే ఉద్దేశంతో లేదు.

    టీమ్ ఇండియా కోచ్ పదవికి విదేశీయుడిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. సౌతాఫ్రికాకు చెందిన గారీ కిరిస్టెన్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు మరో విదేశీయుడు కోచ్‌గా రాలేదు. అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ భారత జట్టు కోచ్ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. రవిశాస్త్రి తర్వాత ఆ పదవిని చేపట్టడానికి టామ్ మూడీ ఆసక్తి చూపిస్తున్నాడని సన్నిహితుల ద్వారా తెలుస్తున్నది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ స్పోర్ట్స్ ఒక కథనాన్ని వెలువరించింది. టామ్ మూడీ భారత జట్టు హెడ్ కోచ్ పదవికి సిద్దంగా ఉన్నాడని ఆ కథనంలో పేర్కొన్నారు.

    టీమ్ ఇండియా కోచ్‌గా టామ్ మూడీ రావాలని ఆసక్తిగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి (PC: IPL)


    టామ్ మూడీ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు కోచ్‌గా పని చేశాడు. అతడు వెస్ట్రన్ ఆస్ట్రేలియా వంటి దేశవాళీ జట్లకు కూడా కోచింగ్ ఇచ్చాడు. 2007లో శ్రీలంక వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరినప్పుడు కోచ్‌గా టామ్ మూడీనే ఉన్నాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో టైటిల్ గెలిచినప్పుడు టామ్ మూడీ కోచ్‌గా ఉన్నాడు. మధ్యలో ఐపీఎల్ వదలి వెళ్లినా.. 2021 నుంచి హైదరాబాద్ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో 2017, 2019లో టామ్ మూడీ భారత జట్టు కోచ్ పదవికి షార్ట్ లిస్ట్ అయ్యాడు. కానీ చివరి క్షణంలో ఆ పదవిని కోల్పోయాడు. మరో నెలరోజుల్లో కొత్త కోచ్ పదవిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నది.

    Cristiano Ronaldo: మ్యాచ్ ముగియగానే రొనాల్డో ఆ బాత్ టబ్‌లోనే స్నానం చేస్తాడంటా.. దాని ఖరీదు, ప్రత్యేకతలు తెలుసా?




    అనిల్ కుంబ్లే ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్రదర్శన పేలవంగా ఉన్నది. దీంతో అతడిని కోచ్‌గా ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. విదేశీ కోచ్ కనుక కచ్చితంగా కావాలను కుంటే అందులో టామ్ మూడీనే ముందు వరుసలో ఉంటాడని తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Team india

    తదుపరి వార్తలు