P.V.Sindhu: పి.వి.సింధుకు అదిరిపోయే బహుమతి ఇచ్చిన నాగార్జున..

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది  బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఈ వరల్డ్ ఛాంపియన్‌కు నాగార్జున అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.

news18-telugu
Updated: September 14, 2019, 5:57 PM IST
P.V.Sindhu: పి.వి.సింధుకు అదిరిపోయే బహుమతి ఇచ్చిన నాగార్జున..
నాగార్జున,పివీ సింధు (File photos)
  • Share this:
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది  బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఇప్పటికే పి.వి.సింధును రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమెను అభినందించిన సంగతి తెలిసిందే కదా.  తాజాగా తెలుగు తేజం సింధుకూ హీరో నాగార్జున చేతులు మీదుగా  బీఎం డబ్ల్యూ కారును ఏపీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్ బహుకరింప చేసారు.  చాముండేశ్వరి నాథ్.. సింధుకి గిఫ్ట్‌గా ఇస్తోన్న నాల్గో కార్ ఇది. దేశ వ్యాప్తంగా క్రీడల్లో రాణిస్తున్న పలువురికి ఇప్పటి వరకు 22 కార్ల వరకు చాముండేశ్వరి నాథ్ బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..  ఫైనల్‌లో పి.వి.సింధూ ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఆడిన తీరు పలువురు క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచిందన్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పి.వి.సింధూకు  నాగార్జున చేతులు మీదుగా చాముండేశ్వరి నాథ్ ఈ కారు తాళాలు బహుమతిగా ఇప్పించారు.

tollywood senior top hero nagarjuna akkineni gifted bmw car to badminton star pv sindhu,nagarjuna akkineni,pv sindhu,nagarjuna akkineni pv sindhu,nagarjuna gifted to bmw car to pv sindhu,nagarjuna akkineni twitter,nagarjuna akkineni instagram,nagarjuna akkineni facebook,pv sindhu instagram,pv sindhu twitter,pv sindhu facebook,tollywood,badminton,నాగార్జున అక్కినేని,పివి సింధు,అక్కినేని నాగార్జున పీవి సింధు,అక్కినేని నాగార్జున పీవి సింధు కారు గిఫ్ట్,పివీ సింధుకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన నాగార్జున,
పివీ సింధుకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన నాగార్జున (Instagram/Photo)


ఈ సందర్భంగా సింధును తీర్చిదిద్దిన కోచ్ గోపిచంద్‌ను కూడా నాగార్జున అభినందనలతో ముంచెత్తారు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...