• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • TOLLYWOOD ACTOR MANCHU VISHNU GETS SWEET HEAD ACHE FROM IPL 2021 AND HERES WHY SRD

IPL 2021 : ఐపీఎల్ వల్ల హీరో మంచు విష్ణుకు పెద్ద తలనొప్పి...ఎందుకంటే...

IPL 2021 : ఐపీఎల్ వల్ల హీరో మంచు విష్ణుకు పెద్ద తలనొప్పి...ఎందుకంటే...

IPL 2021 : ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. ఏ సమయంలోనైనా ఐపీఎల్ వ్యూయర్ షిప్ రికార్డులు బద్దలు కొడుతూనే ఉంటుంది. పెద్దల నుంచి చిన్నారుల వరకు ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తురనడంలో ఎటువంటి సంశయం లేదు.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. కరోనా కాలంలో ఈ సీజన్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఎప్పుడూ కరోనా వార్తలతో విసుగుచెందుతున్న ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది ధనాధన్ లీగ్. ఇక, క్యాష్ రిచ్ లీగ్ కోసం ప్రతి ఇంటా మినీ వార్ నడుస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో రిమోట్ లు కోసం గొడవలు జరుగుతుంటాయ్. అలా ఉంటది, ఐపీఎల్ క్రేజ్. ఇక, ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ, ధోనీలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి క్రికెటర్లకు అభిమాన గణం బోలెడు. ఇక, వీరి కెప్టెన్ల గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు జరుగుతుందంటే అది ఫ్యాన్స్ కు పండుగ కింద లెక్కే. అయితే, ధోనీ ఫ్యాన్స్ కోహ్లీని ట్రోల్ చేస్తే... విరాట్ అభిమానులు మిస్టర్ కూల్ ను ట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. మా క్రికెటర్ గొప్పోడు అంటే మా క్రికెటర్ గొప్ప అని ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు. ఇలాంటి రచ్చే.. టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇంట్లో జరుగుతోంది.

    మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు అరియానా, వివియానా మధ్య ఓ టఫ్ వార్ జరుగుతోందట. ఐపీఎల్ వల్ల మంచు విష్ణుకు తలనొప్పి వస్తుందట. కారణమేంటంటే..అరియానా ధోనీ ఫ్యాన్ అయితే, వివియానాకు కోహ్లీ అంటే అభిమానం. దీంతో చెన్నై, బెంగళూరు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుందట. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.


    " అరి ధోనీ ఫ్యాన్. వివి కోహ్లీ ఫ్యాన్. ఈ ఇద్దరూ.. ధోనీ, కోహ్లీల గొప్ప ఎవరూ అని గొడవపడుతున్నారు. ఈ గొడవ కూడా మాములుగా కాదు. ప్లీజ్, ఈ విషయంలో మీరే సాయం చేయండి " అంటూ ట్వీట్ చేశాడు మంచు విష్ణు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: