హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Paralympics: టోక్యో పారా ఒలింపిక్స్‌‌లో భారత్‌కు తొలి పతకం.. భవీనాబెన్‌ పటేల్‌కు రజతం..

Tokyo Paralympics: టోక్యో పారా ఒలింపిక్స్‌‌లో భారత్‌కు తొలి పతకం.. భవీనాబెన్‌ పటేల్‌కు రజతం..

భవీనాబెన్‌ పటేల్‌(Image-Twitter)

భవీనాబెన్‌ పటేల్‌(Image-Twitter)

టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌ (Tokyo Paralympics) లో భారత్‌కు తొలి పతకం దక్కింది. భారత ప్యాడ్లర్‌ భవీనాబెన్‌ పటేల్‌ (Bhavina Ben Patel) రజతం సాధించింది.

టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌ (Tokyo Paralympics) లో భారత్‌కు తొలి పతకం దక్కింది. భారత ప్యాడ్లర్‌ భవీనాబెన్‌ పటేల్‌ (Bhavina Ben Patel) రజతం సాధించింది. అద్భుతమైన పోరాట పటిమతో మహిళల టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన భవీనా.. పసిడి పోరులో చైనా క్రీడాకారిణి యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో భవీనాబెన్‌కు రజతం లభించింది. పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇక, పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి.

పారా ఒలంపిక్స్‌లో రజతం సాధించిన భవీనాబెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ( అభినందించారు. ‘భవినాబెన్ పటేల్ చరిత్రను లిఖించారు. ఆమె మన దేశానికి ఒక చారిత్రాత్మక రజత పతకాన్ని తెస్తుంది. అందుకు ఆమెకు అభినందనలు. ఆమె జీవిత ప్రయాణం యువతకు ప్రేరణను ఇవ్వడంతో పాటుగా, క్రీడల వైపు ఆకర్షిస్తుంది’అని మోదీ ట్వీట్ చేశారు. ఇక, క్రీడాకారులు వీరేంద్ర సెహ్వాగ్, పీటీ ఉష.. తదితరులు భవీనాబెన్‌కు సోషల్ మీడియా అభినందనలు తెలిపారు.

Olympics 2036: ఒలింపిక్స్‌ 2036కు భారత్ ఆతిథ్యం ఇస్తుందా? ఇందుకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?భవీనా బెన్‌ పటేల్‌ది గుజరాత్‌లోని మెహసానా. అయితే భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె 2016 రియో పారాలింపిక్స్‌కు ఎంపికైంది. కానీ కొన్ని కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయినా భవీనా పట్టుదల వీడలేదు. టోక్యోలో పారాలింపిక్స్‌లో ఎంట్రీ ఇచ్చింది. తొలి మ్యాచ్‌ నుంచే బలమైన ధృఢ సంకల్పంతో ముందుకు సాగింది. క్వార్టర్ ఫైనల్ లో క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్ 2, రియో పారా ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులో ఘన విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి రాంకోవిక్‌ను 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. శ‌నివారం జ‌రిగిన సెమీఫైన‌ల్లో చైనా ప్యాడ్లర్​ మియావో జాంగ్​పై 3-2తో తిరుగులేని విజ‌యం సాధించింది. వరల్డ్​ నంబర్​ త్రీ ప్లేయర్​ అయిన జాంగ్‌ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 స్కోర్‌తో మ‌ట్టిక‌రిపించింది. దీంతో ఫైన‌ల్‌కు చేరిన తొలి భార‌త టీటీ ప్లేయ‌ర్‌గా చరిత్రకెక్కింది.

First published:

Tags: Olympics, Sports, Tokyo

ఉత్తమ కథలు