Paralympics: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ అధికారి యతిరాజ్.. అతడి బ్యాగ్రౌండ్ తెలుసా?

పారాలింపిక్స్‌లో రతజం సాధించిన ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ (PC: Paralympics/Twitter)

Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్‌లో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్‌లో రతజ పతకం సాధించాడు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన మొట్ట మొదటి ఐఏఎస్ అధికారిగా యతిరాజ్ రికార్డు సృష్టించారు.

  • Share this:
    టోక్యో (Tokyo) వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో (Paralympics 2020) భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఆదివారం ఉదయం జరిగిన పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్ (Suhas Yatiraj) రజత పతకం సాధించాడు. వరల్డ్ నెంబర్ 1, ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ మజుర్ చేతిలో యతిరాజ్ 21-15, 17-21, 15-21 తేడాతో ఓడిపోయాడు. తొలి గేమ్‌ను చాలా కాన్ఫిడెంట్‌గా ఆడి గెలిచిన యతిరాజ్.. రెండో గేమ్ నుంచి పట్టు కోల్పోయాడు. అయినా సరే చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్ సాగింది. కానీ చివరకు వరల్డ్ నెంబర్ 1 మీద ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది. సుహాస్ యతిరాజ్ ఒక ఐఏఎస్ అధికారి (IAS Officer). ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లాకు మెజిస్ట్రేల్ (కలెక్టర్)గా వ్యవహరిస్తున్నారు. యతిరాజ్ రజతం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ట్విట్టర్ వేదికగా అభినందించారు. అలాగే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా యతిరాజ్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

    'ఆరేళ్లుగా ఒలింపిక్ పతకం కోసం కష్టపడ్డాడు. ఈ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. మన కష్టానికి తగిన ఫలితం వస్తే ఆ ఆనందమే వేరు. నేను ఆయనను చూసి చాలా గర్వపడుతున్నాను' అని యతిరాజ్ భార్య, ఘజియాబాద్ అసిస్టెంట్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ రితూ సుహాస్ అన్నారు. కేంద్ర మాజీ క్రీడా శాఖ మంత్రి కిరన్ రిజిజు యతిరాజ్ రజత పతకం సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.









    పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్‌గా యతిరాజ్ రికార్డు సృష్టించాడు. సుహాస్ ప్రస్తుతం ఎస్ఎల్ 4 కేటగిరీలో వరల్డ్ నెంబర్ 3 ర్యాంకులో ఉన్నాడు. 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సుహాస్ కర్ణాటకలో జన్మించారు. ఎన్ఐటీ కర్ణాటకలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సివిల్స్ రాసి.. ఆయనకు ఇష్టం అయిన ఐఏఎస్‌ను సాధించారు. ప్రస్తుతం గౌతమ్ బుద్దా నగర్ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉన్న సుహాస్.. అంతకు ముందు ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, ఆజమ్‌ఘర్, జాన్‌పూర్, సోన్‌భద్రా జిల్లాల్లో కూడా పని చేశారు. గత ఏడాదిన్నరగా నొయిడా జిల్లాలో మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్న ఆయన కోవిడ్-19 సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా మారిపోయారు. అయినా సరే పారాలింపిక్స్ కోసం ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతీ రోజు ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసుకొని.. రాత్రి 10 గంటల నుంచి ప్రాక్టీస్ చేసే వాడినని యతిరాజ్ చెప్పారు. గత ఆరేళ్లుగా నా ఉద్యోగాన్ని, ఆటను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నట్లు ఆయన అన్నారు. ఇన్నేళ్ల కష్టానికి తగిన ఫలితం వచ్చిందని సంబరపడ్డారు.

    US Open: యూఎస్ ఓపెన్ నుంచి ఆష్ బార్టీ అవుట్.. వరల్డ్ నెంబర్ 1కు షాకిచ్చిన అన్‌సీడెడ్ షెల్బీ రోజర్స్


     

    Published by:John Naveen Kora
    First published: