హోమ్ /వార్తలు /క్రీడలు /

Paralympics 2020: భారత్‌కు మరో స్వర్ణం.. పారాలింపిక్స్ షూటింగ్‌లో గోల్డ్ కొట్టిన మనీష్ నర్వాల్.. సింగ్‌రాజ్‌కు సిల్వర్

Paralympics 2020: భారత్‌కు మరో స్వర్ణం.. పారాలింపిక్స్ షూటింగ్‌లో గోల్డ్ కొట్టిన మనీష్ నర్వాల్.. సింగ్‌రాజ్‌కు సిల్వర్

స్వర్ణ పతకం గెలిచిన పారా షూటర్ మనీష్ నర్వాల్ (PC: Twitter)

స్వర్ణ పతకం గెలిచిన పారా షూటర్ మనీష్ నర్వాల్ (PC: Twitter)

పారాలింపిక్స్ 2020లో భారత పతకాల వేట కొనసాగుతున్నది. శనివారం షూటింగ్‌లో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో మనీష్ నర్వాల్ స్వర్ణం, సింగ్‌రాజ్ అధానా రజతం నెగ్గారు.

పారాలింపిక్స్ 2020లో (Paralympics 2020) భారత షూటర్లు శనివారం పతకాల పంట పండించారు. మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్ 1 కేటగిరీలో మనీష్ నర్వాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఇదే కేటగిరిలో సింగ్‌రాజ్ అదానా (Singhraj Adana) రజత పతకం కొల్లగొట్టాడు. కాగా సింగ్‌రాజ్ రెండు రోజుల క్రితం 10 మీటర్ల ఎయిర్ పిస్టర్‌లో కాంస్యం సాధించడం విశేషం. టోక్యో పారాలింపిక్స్‌లో అవనీ లేఖర, సుమిత్ అంటిల్ స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా మనీష్ నర్వాల్ మరో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత స్వర్ణాల సంఖ్య 3కి చేరింది. శనివారం ఒకే ఈవెంట్‌లో భారత్‌కు ఒక స్వర్ణంతో పాటు మరో రజతం కూడా దక్కింది. పీ1 పురుషుల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ కేటగిరీలో 19 ఏళ్ల మనీష్ నర్వాల్ 218.2 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. ఇది పారాలింపిక్స్‌లో ఒక రికార్డు. ఇదే ఈవెంట్‌లో సింగ్‌రాజ్ అదానా 216.7 స్కోర్ సాధించి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక రష్యాకు చెందిన సెర్గీ మలెషెవ్ 196.8 స్కోర్‌తో కాంస్య పతకం గెలిచాడు. కాగా, అంతకు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో నర్వాల్ 7వ స్థానంలో, అదాన 4వ స్థానంలో నిలవడం గమనార్హం.

ఎస్‌హెచ్1 కేటగిరీలో ఒక కాలు, ఒక చేయి లేదా రెండు అవయవాల్లో కూడా వైకల్యం ఉన్న అథ్లెట్లు పోటీ పడతారు. ఈ విభాగంలో షూటింగ్‌లో పాల్గొనే వాళ్లు నిలబడి లేదా కూర్చొని ఒకే చేత్తో పిస్టల్ పట్టుకొని షూట్ చేస్తారు. కాగా, సింగ్‌రాజ్ అదాన రెండు రోజుల క్రితం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం గెలిచాడు. వీరి గెలుపుతో మొత్తం పతకాల సంఖ్య 15కి చేరింది. పారాలింపిక్స్‌లో ఇండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.

మరోవైపు భారత పారా అథ్లెట్లు మరికొన్ని క్రీడా విభాగాల్లో కూడా పతకాలు సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ఫలితాలు కూడా రానున్నాయి.

First published:

Tags: Olympics, Shooting, Tokyo Olympics

ఉత్తమ కథలు