పారాలింపిక్స్‌లో సూపర్ సండే మొదలైంది. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్ రజత పతకం గెలవగా... మరో బ్యాడ్మింటన్ ఆటగాడు కృష్ణ నగార్ ఫైనల్లో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం టోక్యోలోని యోయోగీ నేషనల్ స్టేడియంలో జరిగిన పురుషుల ఎస్‌హెచ్ 6 కేటగిరీ బ్యాడ్మింటన్ ఫైనల్లో చు మన్ కాయ్పై 17-21, 21-16, 21-17 తేడాతో కృష్ణ నగార్ విజయం సాధించాడు. రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల నగార్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ ఏడాది దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు గెలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.