టోక్యో పారా ఒలింపిక్స్ (Tokyo Paralympics 2020)లో భారత(India) క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లను ఆదర్శంగా తీసుకొని పారా అథ్లెట్లు కూడా తమదైన శైలిలో విజృంభిస్తున్నారు. ఇక, లేటెస్ట్ గా వరల్డ్ నెం.1 పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్ స్వర్ణ పతాకాన్ని నెగ్గాడు. ఫైనల్ లో 2-0 తేడాతో ప్రత్యర్ధిని చిత్తు చేసిన స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. దీంతో చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్ లో భారత్ కు ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించిన అథ్లెట్ అరుదైన ఘనత సాధించాడు ప్రమోద్. ఇక, ఈ గేమ్స్ లో భారత్ కు ఇది ఓవరాల్ గా నాలుగో స్వర్ణ పతకం.
బ్యాడ్మింటన్ ఎస్ఎల్3 విభాగంలో బ్రిటీష్ షట్లర్‌తో జరిగిన ఫైనల్లో 21-14, 21-17 తేడాతో వరుస సెట్లను గెలిచిన ప్రమోద్ భగత్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన ప్రమోద్.. ఫైనల్ లో ప్రత్యర్థికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. పదునైన స్మాష్ షాట్లు, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థి ఆటకు చెక్ చెప్పాడు. ఇక, ప్రమోద్ గోల్డ్ సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు సాధించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.
Pramod wins 🥇!!@PramodBhagat83 wins 2-0 to script history to bag 1st ever 🥇 in Men's Singles SL3 event at #Paralympics
4 time BWF Champion adds Paralympics Gold to his name
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కి ఇది 16వ మెడల్, కాగా ఈ రోజు రెండో స్వర్ణం. అంతకుముందు శనివారం ఉదయం భారత మెన్స్ షూటర్లు మనీష్ నర్వాల్, సింగ్‌రాజ్ ఆదాన రెండు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. 50 మీటర్ల షూటింగ్ మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడిన భారత షూటర్లు మనీష్ నర్వాల్ స్వర్ణం సాధించగా... సింగ్‌రాజ్ ఆదాన రజతం సాధించాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.