హోమ్ /వార్తలు /క్రీడలు /

Paralympics 2020 : పారాలింపిక్స్ లో దుమ్మురేపిన ఆర్చర్ హార్వీందర్ సింగ్.. 13 కు చేరిన మెడల్స్ కౌంట్..

Paralympics 2020 : పారాలింపిక్స్ లో దుమ్మురేపిన ఆర్చర్ హార్వీందర్ సింగ్.. 13 కు చేరిన మెడల్స్ కౌంట్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Paralympics 2020 : టోక్యో పారా ఒలింపిక్స్ (Tokyo Paralympics 2020) లో భారత(India) క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.

టోక్యో పారా ఒలింపిక్స్ (Tokyo Paralympics 2020) లో భారత(India) క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లను ఆదర్శంగా తీసుకొని పారా అథ్లెట్లు కూడా తమదైన శైలిలో విజృంభిస్తున్నారు. పారాలింపిక్స్‌ 2020లో భారత్‌ పతకాల సంఖ్య 13కు చెరింది. ఇక, కొరియో పారా ఆర్చర్ కిమ్ మిన్ సుతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్చర్ హర్వీందర్ సింగ్ (Harvinder Singh) షూట్ ఆఫ్‌లో 6-5 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుని, కాంస్య పతకం గెలిచాడు. పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన మొట్టమొదటి భారత ఆర్చర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు హర్వీందర్ సింగ్. ఓవరాల్‌గా భారత్‌కి పారాలింపిక్స్‌ 2020లో ఇది 13వ పతకం. ఇంతకుముందు పారాలింపిక్స్ చరిత్రలోనే 1968 నుంచి 2016 వరకూ ఓవరాల్‌గా భారత్ మొత్తం 12 పతకాలు గెలవగా, టోక్యో పారాలింపిక్స్‌లోనే 13 పతకాలు సాధించారు భారత పారా అథ్లెట్లు.

ఇక, ఆర్చరీలో కాంస్య పతకం సాధించిన హార్వీందర్ సింగ్ ను భారత ప్రధాని మోదీ అభినందించారు. అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అతన్ని చూసి దేశం గర్వపడుతుందని తెలిపారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు.

ఇక, ఈ మెగా టోర్నీలో భారత షూటర్ అవని లేఖరా (Avani Lekhara) అరుదైన ఘనత సాధించింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి ఇండియ‌న్‌గా అవ‌ని రికార్డుల్లో నిలిచింది. ఇప్పటికే 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన అవని.. శుక్రవారం ఉదయం జరిగిన 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది. దీంతో పారాలింపిక్స్‌ 2020లో అవని రెండు మెడల్స్ ఖాతాలో వేసుకుంది. దాంతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి ఇండియ‌న్‌గా అవ‌ని నిల‌వ‌డం విశేషం.

హై జంప్ టీ64 విభాగంలో 2.07 మీటర్లతో ఆసియా రికార్డు క్రియేట్ చేసిన ప్రవీణ్ కుమార్... రజత పతకాన్ని సాధించాడు. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్‌లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన జోనాథన్‌ ఎడ్‌వర్డ్స్‌ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్‌ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు.

ఇది కూడా చదవండి : వీడెక్కడ దొరికాడ్రా బాబూ... నాలుగో టెస్ట్ లోనూ జార్వో మామ ఎంట్రీ.. ఈ సారి ఏం చేశాడంటే..

 దాంతో ప్రవీణ్‌ కుమార్‌ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు. పోలాండ్‌కు చెందిన మసీజ్‌ లెపియాటోకు బ్రాంజ్ మెడల్‌ దక్కింది. ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన ఇండియా... పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది.

First published:

Tags: PM Narendra Modi, Sports, Tokyo

ఉత్తమ కథలు