Home /News /sports /

TOKYO PARALYMPICS 2020 HERE THE INSPIRING STORY OF GOLD MEDALIST PRAMOD BHAGAT SRD

Pramod Bhagat : చిన్న వయస్సులోనే పోలియో.. అయినా కృంగిపోలేదు.. అతని జీవితం అందరికీ ఆదర్శం..

Pramod Bhagat (Twitter)

Pramod Bhagat (Twitter)

Pramod Bhagat : ప్రమోద్ భగత్... చిన్న వయసులోనే పోలియో బారిన పడ్డాడు. పోలియోతో ప్రమోద్‌ ఎడమకాలు చచ్చుబడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్‌ తండ్రి అందరిలాగా బాధపడలేదు.

    పారాలింపిక్స్‌ (Tokyo Paralympics) బ్యాడ్మింటన్‌(SL3)లో భారత్‌ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ (Pramod Bhagat).. ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ టూ ర్యాంకర్‌, గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు బ్యాడ్మింటన్‌లో ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ చరిత్ర సృష్టించిన ప్రమోద్ భగత్ గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకోవడం గ్యారెంటీ. 1988 జూన్‌ 4న ఒడిశాలో జన్మించిన ప్రమోద్ భగత్... చిన్న వయసులోనే పోలియో బారిన పడ్డాడు. పోలియోతో ప్రమోద్‌ ఎడమకాలు చచ్చుబడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్‌ తండ్రి అందరిలాగా బాధపడలేదు. తన కొడుకును ఒక బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ప్రమోద్‌ ఎన్నో కష్టాలనోర్చి బ్యాడ్మింటన్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు.అలా బ్యాడ్మింటన్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ప్రపంచ నెంబర్‌వన్‌ పారా షట్లర్‌గా ఎదిగాడు. ఆ శ్రమతో టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-3 కేటగిరీలో ప్రపంచనెంబర్‌వన్‌గా ఎదిగిన ప్రమోద్‌ భగత్‌ జీవితం ఇప్పుడు అందరికీ ఆదర్శం.

    ప్రమోద్‌ భగత్‌ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌ ఆటకు ఆకర్షితుడయ్యాడు. తన ఇంటి పక్కనవాళ్లు బ్యాడ్మింటన్‌ను ఆడుతుండగా చూసిన ప్రమోద్‌ దానినే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్‌లో మెళుకువలు నేర్చుకున్న ప్రమోద్‌ తొలుత జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో టైటిల్స్‌ కొల్లగొట్టాడు.

    అనంతరం పారా బ్యాడ్మింటన్‌వైపు అడుగులు వేసిన ప్రమోద్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తాజాగా 2019లో దుబాయ్‌ వేదికగా పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో సింగిల్స్‌ విభాగంలో పోటీ పడిన ప్రమోద్‌ స్వర్ణం సాధించి జాతిని గర్వించేలా చేశాడు.

    ఇది కూడా చదవండి : అమితాబ్ బచ్చన్ సీటుకే ఎసరుపెట్టిన దాదా.. KBC లో గంగూలీ, సెహ్వాగ్ ఎంత గెలిచారంటే..!

    ప్రమోద్‌ భగత్‌ సాధించిన రికార్డులు..
    -SL3 కేటగిరీలో వరల్డ్ నెం .1 పారా-బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రమోద్‌ భగత్‌ రికార్డు

    -ఐడబ్ల్యూఏఎస్‌ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్‌, డబుల్స్ ,మిక్సడ్‌ డబుల్స్ ఈవెంట్‌లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం.

    -ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు.

    -ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్‌లో గోల్డ్‌, కాంస్య పతకాలు

    -2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు.

    -RYLA ఇంటర్నేషనల్ చాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు

    భగత్ సాధించిన స్వర్ణంతో భారత్‌ పతకాల సంఖ్య 17కు చేరగా.. వీటిలో నాలుగు పసిడి, ఏడు రజతం, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా పారా అథ్లెట్లు టోక్యో పారాలింపిక్స్ లో విజృంభించారు. భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Badminton, Sports, Tokyo, Trending

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు