టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics 2020) సిరియా (Syria) టేబుల్ టెన్నిస్ (Table Tennis) ప్లేయర్ హెండ్ జజా (Hend Zaza) రికార్డు సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కాడు. అంతే కాకుండా ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో క్వాలిఫికేషన్ రౌండ్ ద్వారా పాల్గొంటున్న తొలి క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందాడు. మలేషియాకు చెందిన మరియానాను ఓడించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తన ఆరవ ఏట నుంచే టేబుల్ టెన్నిస్ ఆడటం మొదలు పెట్టిన హెండ్ జజా అనేక ఈవెంట్లలో పాల్గొన్నది. దోహా, ఖతార్‌లో జరిగిన వరల్డ్ హోప్స్ వీక్ అండ్ చాలెంజ్ ఈవెంట్లలో పాల్గొన్నది. ఆ సమయంలోనే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్‌కు చెందిన అధికారి ఒకరు ఆమె ప్రతిభను గుర్తించారు. 1968 తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అతి పిన్నవయస్కురాలిగా హెండ్ జజా రికార్డు సృష్టించింది. హెండ్ జజా సిరియా నేషనల్ చాంపియన్‌గా నిలిచింది. ఆమె అన్ని వయసుల కేటగిరీలో పాల్గొని సీనియర్లను కూడా ఓడించి సంచలనం సృష్టించింది. 'మా అన్నయ్యను చూసి నేను స్పూర్తి పొందాను. ఆయన కూడా జాతీయ చాంపియన్. అతడి నుంచే నేను మొదట ఆట నేర్చుకున్నాను' అని జజా చెప్పుకొచ్చింది.
తన చిన్నతనంలో అన్నయ్య మ్యాచ్ వీడియోలు బాగా చూసేదంటా. దాంతో టేబుల్ టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్న హెండ్ జజా తాను కూడా ఏదో ఒక రోజు ఆ గేమ్‌లో చాంపియన్‌గా నిలవాలని నిర్ణయించుకున్నది. అన్నయ్య దగ్గరకు వెళ్లి తన మనసులో మాట చెప్పగానే అతడు చాలా ఎంకరేజ్ చేసినట్లు చెప్పింది. ఈ రోజు ఒలింపిక్స్‌లో అర్హత సాధించడం కోసం చాలా కష్టపడ్డానని.. పతకం కూడా నెగ్గితే తన కోరిక తీరుతుందని చెప్పుకొచ్చింది. హెండ్ జజా ఒలింపిక్స్ తొలి రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన లియూ జియాతో తలపడనున్నది.
జపాన్‌కు చెందిన స్కేట్ బోర్డర్ కొకొనా హిరాకి కూడా 12 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మరో చిన్న వయసు అథ్లెట్. వీరి కంటే ముందు 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో జపాన్ స్విమ్మర్ యుకారి టేకేమోటో 13 ఏళ్ల వయసులో విశ్వ క్రీడల్లో పాల్గొన్నది. ఇక ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అత్యంత పెద్ద వయసు అథ్లెట్ ఆస్ట్రేలియాకు చెందిన మేరీ హన్నా. ఈక్వెస్ట్రియన్ విభాగంలో పోటీ పడుతున్న ఆమెకు ఇవి 7వ ఒలింపిక్స్. ఆమెకు ప్రస్తుతం 66 ఏళ్ల వయసు. 1972 ఒలింపిక్స్‌లో బ్రిటన్‌కు చెందిన లోరా జాన్స్టోన్ 70 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌లో పాల్గొన్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics