TOKYO OLYMPICS WRESTLING FEDERATION OF INDIA GIVES SHOCK TO VINESH PHOGAT AND TEMPORARILY SUSPENDED FOR THIS REASON SRD
Vinesh Phogat : " స్లార్ రెజ్లర్లు అని ఫీల్ అయితే ఇలాగే ఉంటుంది " .. వినేశ్ ఫోగాట్ కు భారీ షాక్..
Vinesh Phogat (Twitter)
Vinesh Phogat : ఒలింపిక్స్ రెజ్లింగ్ బౌట్లలో టీమిండియా అధికారిక ‘శివ్ నరేశ్’ టీమ్ జెర్సీలను కాదని వినేశ్ నైకీ జెర్సీలను ధరించి బరిలోకి దిగింది. ఆమె విపరీత పోకడ, క్రమశిక్షణ రాహిత్యం భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)కు ఆగ్రహం తెప్పించింది.
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ (Vinesh Phogat)కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics 2020) శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకు డబ్ల్యూఎఫ్ ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు ఆగస్టు 16 వరకు వినేశ్ ఫోగాట్‌కు గడువు ఇచ్చింది. దుష్ప్రవర్తనకు గానూ మరో యువ రెజ్లర్ సోనమ్‌కు కూడా డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది. టోక్యో విశ్వక్రీడల్లో వినేశ్ క్వార్టర్ ఫైనల్లో ఓడింది. హంగేరి శిక్షణకు వెళ్లిన ఆమె అక్కడి నుంచే నేరుగా టోక్యోకు వచ్చింది. కానీ భారత జట్టు క్రీడాకారులు బస చేసిన క్రీడా గ్రామంలో ఉండకుండా వెలుపల తన హంగేరి కోచ్, సహాయకులతో బస చేసింది. భారత ఇతర మహిళా రెజ్లర్లు సోనమ్, సీమా, అన్షు భారత్ నుంచి టోక్యోకు రావడంతో వారి నుంచి తనకు కరోనా సోకే ప్రమాదం ఉండవచ్చని భావిస్తూ వినేశ్ వారితో కలిసి ఉండేందుకు, కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నిరాకరించింది.
అంతేకాక ఒలింపిక్స్ రెజ్లింగ్ బౌట్లలో టీమిండియా అధికారిక ‘శివ్ నరేశ్’ టీమ్ జెర్సీలను కాదని వినేశ్ నైకీ జెర్సీలను ధరించి బరిలోకి దిగింది. ఆమె విపరీత పోకడ, క్రమశిక్షణ రాహిత్యం భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కఠిన చర్యలు చేపట్టింది. " ఫొగాట్ తన ప్రవర్తనతో తీవ్రస్థాయిలో క్రమశిక్షణను ఉల్లంఘించింది. అందుకే తాత్కాలిక నిషేధం విధించాం. ఇపుడామె ఎలాంటి రెజ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీల్లేదు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు కూడా పంపాం. సంజాయిషీ ఇచ్చేందుకు ఈ నెల 16లోగా గడువిచ్చాం" అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు.
తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మరో మహిళా రెజ్లర్ సోనమ్ టోక్యో బయల్దేరడానికి ముందు పాస్‌పోర్ట్ ను డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయంలో తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఆమె మాత్రం తన పాస్‌పోర్ట్‌ను తీసుకొని రావాలని ఏకంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను ఆజ్ఞాపించింది. "మెగా క్రీడల్లో రెజ్లర్లు ఏమి సాధించలేదు కానీ స్టార్ రెజ్లర్లమని ఫీల్ అయ్యారు, తాము ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు" అని WFI అధికారులు తెలిపారు. రెజ్లింగ్ సమాఖ్య తమ అథ్లెట్లను ఎందుకు నియంత్రించలేకపోతుందనే విషయంపై వివరణ ఇవ్వాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) డబ్ల్యూఎఫ్ఐకి నోటీసులు జారీ చేసింది. దీంతో చేసేదేమి లేక వీరిద్దరిపై డబ్ల్యూఎఫ్ఐ చర్యలు తీసుకుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.