ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)పై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తాత్కాలిక నిషేధం విధించింది. మూడు కారణాలతో ఈ 53 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లర్ పై నిషేధం విధిస్తున్నట్లు డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ జరిగేటప్పుడు ఇండియన్ టీమ్ క్రీడాకారులతో కలిసి ఉండడానికి వినేశ్ నిరాకరించిందని.. ప్రాక్టీస్ చేయడానికి కూడా అభ్యంతరం తెలిపిందని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. అలాగే వినేశ్ భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్ కిట్‌ను ధరించకుండా.. ధరించకూడని నైక్ కిట్‌ను ధరించిందని డబ్ల్యూఎఫ్ఐ చెప్పుకొచ్చింది.ఈ అనుచిత ప్రవర్తన కారణంగా ఆమెపై తాత్కాలిక నిషేధం విధిస్తూ నోటీసులు అందించినట్లు సంబంధిత అధికారి వెల్లడించారు. వినేశ్ తన ప్రవర్తన పట్ల వివరణ ఇచ్చేంతవరకు నేషనల్ లేదా డొమెస్టిక్ క్రీడల్లో ఆడటానికి వీలు లేదని ఆయన తెలిపారు. వినేశ్ సమాధానం నమ్మశక్యంగా లేకపోతే డబ్ల్యూఎఫ్ఐ దీర్ఘకాలం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : అలనాటి ఒలింపిక్ టార్చ్ బేరర్.. ఇప్పుడు రోజువారీ కూలీ
అసలేం జరిగిందో తెలుసుకుంటే.. ఒలింపిక్ విలేజ్‌లో వినేశ్ తన తోటి రెజ్లర్లు అయిన సోనమ్ మాలిక్, అన్షు మాలిక్, సీమా బిస్లాలతో ఒకే అంతస్తులో కలిసి ఉండడానికి నిరాకరించింది. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు తాను హంగేరీ నుంచి వచ్చానని.. మిగతా రెజ్లర్లు భారత్ నుంచి వచ్చారని.. అందువల్ల వారి నుంచి తనకు కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఆమె వాదించినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : లార్డ్స్ ఛాలెంజ్ కు టీమిండియా రెడీ.. రెండో టెస్ట్ లో తలపడే తుది జట్లు ఇవే..!
ఈ కారణంగానే ఆమె తోటి రెజ్లర్లతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి కూడా నిరాకరించింది. అంతేకాకుండా రెజ్లింగ్ ఆడేటప్పుడు స్పాన్సర్ కిట్లను కూడా ధరించలేదు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నుంచి నోటీసులు వచ్చాయి. అథ్లెట్లను కూడా అదుపులో పెట్టుకోలేరా అని తమపై అసోసియేషన్ తీవ్రంగా స్పందించినట్లు ఓ అధికారి మీడియాతో చెప్పారు. దీంతో వినేశ్‌ను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ఆ అధికారి మీడియాకు వెల్లడించారు.
వాస్తవానికి బల్గేరియా, పోలాండ్, ఎస్టోనియా విదేశాల్లో శిక్షణ పొందిన అనంతరం వినేశ్ ఇండియాకి బయలుదేరాల్సిన ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇండియాకి వస్తే టోక్యోకు బయలుదేరడానికి ముందు కోవిడ్-19 పరీక్షల చేయించుకోవాల్సి వస్తుందని భావించి వినేశ్ కోచ్ తో కలిసి హంగేరీ వెళ్ళిందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒలింపిక్స్‌లో మహిళ రెజ్లింగ్ పోటీల్లో గెలిచి ఓ పతకం తెస్తుందని అందరూ ఆశించారు కానీ ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో బెలారస్ రెజ్లర్ వెనెసాపై ఓడిపోయి వట్టిచేతులతో వెనుదిరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tokyo Olympics, Wrestling