హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : దీపక్ పునియా ఓటమి తర్వాత రిఫరీ రూమ్ కి వెళ్లి భారత కోచ్ వీరంగం.. ఆ తర్వాత ఏమైందంటే..

Tokyo Olympics : దీపక్ పునియా ఓటమి తర్వాత రిఫరీ రూమ్ కి వెళ్లి భారత కోచ్ వీరంగం.. ఆ తర్వాత ఏమైందంటే..

Deepak Punia (Photo Credit : AFP)

Deepak Punia (Photo Credit : AFP)

Tokyo Olympics : అయితే భారత రెజ్లింగ్ కోచ్ తీసుకున్న ఛాలెంజ్‌ను రిఫరీ బోర్డు తిరస్కరించింది. అయితే ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన దీపక్ పూనియా ఫారిన్ కోచ్ మరోద్ గైద్రోవ్... మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోపం చల్లారక రిఫరీల రూమ్ కెళ్లాడు.

ఇంకా చదవండి ...

ప్రతిష్టాత్మక కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ రెజ్లర్ దీపక్ పునియాకు ఓటమి ఎదురైంది. ఈ ఫైట్ లో దీపక్ పునియా ప్రత్యర్థి అమ్నే చేతిలో 4-2 తేడాతో ఓడిపోయాడు. ఫస్ట్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన పునియా చేజేతులరా ఆఖర్లో మ్యాచ్ ను ప్రత్యర్థికి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రిఫరీల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసి, రిఫరీల గొడవ పడిన అతని కోచ్, స్పోర్ట్స్ విలేజ్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. 6 కేజీల విభాగంలో శాన్ మెరినోకి చెందిన మౌలెస్ అమైన్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపిక్ పూనియా 2-3 తేడాతో ఓడాడు. ఆఖరి 10 సెకన్ల వరకూ ఆధిక్యంలో ఉన్న దీపక్ పూనియా, ఆఖర్లో ప్రత్యర్థికి పాయింట్ల అప్పగించి ఓటమి పాలయ్యాడు. అయితే ఈ నిర్ణయంపై భారత రెజ్లర్ కోచ్ మరోద్ గైద్రోవ్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఛాలెంజ్ కూడా చేశాడు. దీపక్ పూనియా డిఫెన్స్‌లో ఉన్నప్పుడే సమయం ముగిసినా రిఫరీ దాన్ని గమనించకుండా ప్రత్యర్థికి పాయింట్లు అప్పగించాడనేది మరోద్ గైద్రోవ్ ఆరోపణ.

అయితే భారత రెజ్లింగ్ కోచ్ తీసుకున్న ఛాలెంజ్‌ను రిఫరీ బోర్డు తిరస్కరించింది. అయితే ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన దీపక్ పూనియా ఫారిన్ కోచ్ మరోద్ గైద్రోవ్... మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోపం చల్లారక రిఫరీల రూమ్‌కి వెళ్లి, ఆ ఫైట్‌కి రిఫరీగా వ్యవహరించిన అధికారిని బూతులు తిట్టడమే కాకుండా, చేయి చేసుకున్నాడట...ఈ హఠాత్ సంఘటనతో దీపక్ పూనియా కోచ్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ఒలింపిక్ కమిటీ, అతన్ని స్పోర్ట్స్ విలేజ్ నుంచి బహిష్కరించింది... 23 ఏళ్ల దీపక్ పూనియా, తన మొదటి ఒలింపిక్స్‌లోనే మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి : 10 ఏళ్ల ఏజ్ గ్యాప్, పెద్దలు అడ్డొచ్చినా లెక్క చేయలేదు.. గబ్బర్ ప్రేమ్ కహానీ సూపరో సూపర్..

ఇక, ఇవాళ రెజ్లింగ్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. సెమీఫైనల్ లో బజరంగ్ పునియా పోరాడి ఓడిపోయాడు. సెమీ ఫైనల్స్‌లో బజరంగ్ పునియా అజర్‌బైజాన్‌కు చెందిన హాజీ అలియేవ్‌ చేతిలో ఓడిపోయాడు. ఇక, కాంస్యం కోసం జరిగే పోరులో తలపడనున్నాడు బజరంగ్ పునియా. హాజీ అలియేవ్.. ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడి బజరంగ్ మీద ఒత్తిడి పెంచాడు. హాజీ అలియేవ్.. 12-5 తేడాతో బజరంగ్ పై నెగ్గాడు. హాజీ అలియేవ్.. అల్లాటప్పా రెజ్లర్ కాదు. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్. 2016లో రియో డి జనేరియోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సైతం ముద్దాడాడతను. 2014, 2015, 2017ల్లో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ విన్నర్. అలాంటి హాజీ అలయేవ్‌ సెమీస్ లో బజరంగ్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌లో జపాన్‌కి చెందిన టకుటో ఒటోగురోతో మ్యాచ్ ఆడబోతున్నాడు బజరంగ్ పూనియా.

First published:

Tags: Sports, Tokyo Olympics, Wrestling

ఉత్తమ కథలు