TOKYO OLYMPICS UPDATES MOROCCAN HEAVYWEIGHT BOXER YOUNESS BAALLA ATTEMPTED TO BITE DAVID NYKIAS EAR DURING HIS DEFEAT TO THE NEW ZEALANDER VIDEO GOES VIRAL SRD
Tokyo Olympics : ఇదేందయ్యా .. ఇది.. ఓడిపోతున్న బాధలో ప్రత్యర్థి చెవిని కొరికేశాడుగా.. వైరల్ వీడియో ..
Photo Credit : Twitter
Tokyo Olympics : క్రీడల్లో గెలుపోటములు సహజం. మ్యాచ్ లో ఓడిపోతున్నామన్న బాధ, అసహనం ప్రతి ప్లేయర్ లో కన్పిస్తూనే ఉంటుంది. ఓటమితో కృంగిపోయిన ఆటగాళ్లను కూడా మనం చూశాం. కొంతమంది మాత్రం తమ ఓటమిని భరించలేక ప్రత్యర్థిపై దాడికి దిగడం చూస్తుంటాం.
క్రీడల్లో గెలుపోటములు సహజం. మ్యాచ్ లో ఓడిపోతున్నామన్న బాధ, అసహనం ప్రతి ప్లేయర్ లో కన్పిస్తూనే ఉంటుంది. ఓటమితో కృంగిపోయిన ఆటగాళ్లను కూడా మనం చూశాం. కానీ కొంతమంది మాత్రం తమ ఓటమిని భరించలేక ప్రత్యర్థిపై దాడికి దిగడం చూస్తుంటాం. అలాంటి ఘటనే టోక్యో ఒలింపిక్స్ లో జరిగింది. మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్ బాల్లా.. న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ న్యీకా చెవి కొరికాడు.విషయంలోకి వెళితే.. మంగళవారం బాక్సింగ్‌లో హెవీ వెయిట్ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ నికా మధ్య పోరు జరిగింది. బౌట్‌లో డేవిడ్ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్.. మూడో రౌండ్‌లో డేవిడ్ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్ దంతాలు తగలగానే డేవిడ్ అతడిని దూరంగా నెట్టేశాడు.
ఈ మ్యాచ్‌లో డేవిడ్ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. కాగా, యూనెస్ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. . అయితే, యూనీస్ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. అతడిని అనర్హుడిగా ప్రకటించింది.
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics ) లో పీవీ సింధు (PV Sindhu) దూకుడు కొనసాగుతోంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటుతోంది. ఫస్ట్ మ్యాచ్ లో అలవోకగా నెగ్గిన భారత స్టార్ ప్లేయర్.. మరో ఈజీ విక్టరీతో ప్రీ - క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. పీవీ సింధు.. 21-9, 21-16తో హాంకాంగ్ ప్లేయర్ చేంగ్ న్గాన్‌ను వరుస గేమ్‌లలో ఓడించి, సిరీస్‌లో మరో అడుగు ముందుకు వేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది తెలుగు తేజం. గ్రూప్ జేలో ఉన్న సింధు.. ఆదివారం మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్ షట్లర్‌తో తలపడిన సింధు.. కేవలం 28 నిమిషాల్లో మ్యాచ్ ముగించి, ఫస్ట్ మ్యాచ్‌లో సత్తా చాటింది. పీవీ సింధు 21-7, 21-10తో వరుస సెట్లలో సునాయాసంగా గెలిచింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.