TOKYO OLYMPICS UPDATES INDIAN GOLFER ADITI ASHOK IN CONTENTION FOR A GOLD MEDAL HERE THE DETAILS SRD
Tokyo Olympics : గోల్డ్ మెడల్ పై ఆశలు రేపుతున్న అదితి అశోక్ గురించి ఈ విషయాలు తెలుసా ..?
Aditi Ashok
రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఈ 23 ఏళ్ల గోల్ఫర్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో శుక్రవారం మూడో రౌండ్ ముగిసే సమయానికి రెండో స్థానంలో నిలిచి మెడల్ వేటలో కొనసాగుతోంది.శుక్రవారం 5 బర్డీస్ (1-అండర్ పార్)తో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా ఉంది
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) లో భారత ఆటగాళ్ల ప్రదర్శనతో అభిమానులు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. పతకాలు తెస్తారనుకున్నా షూటర్లు, ఆర్చర్లు చేతులెత్తేయగా.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పరుషుల, మహిళల హాకీ టీమ్స్ సంచలనాలు సృష్టించాయి.ఇప్పుడు ఈ లిస్ట్‌లో గోల్ఫర్ అదితి అశోక్ (Aditi Ashok) కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఈ 23 ఏళ్ల గోల్ఫర్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో శుక్రవారం మూడో రౌండ్ ముగిసే సమయానికి రెండో స్థానంలో నిలిచి మెడల్ వేటలో కొనసాగుతోంది.శుక్రవారం 5 బర్డీస్ (1-అండర్ పార్)తో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా ఉంది. గత మూడు రోజులుగా ఆమె నిలకడగా రాణిస్తోంది. శనివారం చివరిదైన నాలుగో రౌండ్లో ఇదే నిలకడ కొనసాగిస్తే ఆమె మెడల్ ఖాయం చేసుకుంటుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుఝామున 3 గంటలకే ఈ నాలుగో రౌండ్ ప్రారంభమవుతుంది.భారత యువ గోల్ఫర్ అదితి అశోక్ టోక్యోలో అదరగొడుతోంది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్ ముగిసే సరికి అదితి రెండో స్థానంలో నిలిచింది. కీలకమైన నాలుగో రౌండ్ శనివారం జరగనుంది. ప్రస్తుతం టోక్యో వాతావరణం మారుతోంది. కొన్ని చోట్ల విపరీతంగా ఎండ కాస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.
ఒకవేళ గాలి ఉద్ధృతంగా వీస్తూ.. వర్షం కురిస్తే మూడో రౌండ్ వరకే ఫలితాలను లెక్కలోకి తీసుకుంటారు.అలా జరిగితే భారత్ గోల్ఫర్ అదితికి సిల్వర్ మెడల్ దక్కినట్లే. ప్రస్తుతం అమెరికా అమ్మాయి కొర్దా నెల్లీ 198 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. గోల్ఫ్‌లో ఎవరికి తక్కువ స్కోరుంటే వారే విజేతగా ఆవిర్భవిస్తారు. అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలిరౌండ్లో 67, రెండో రౌండ్లో 66, మూడో రౌండ్లో 68 పాయింట్లు సాధించింది.
ఇక అదితి అశోక్ 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. తద్వారా ఒలింపిక్స్ బరిలో దిగిన అతి పిన్న గోల్ఫర్గా రికార్డుకెక్కింది. అదితి అశోక్‌ది గోల్ఫ్ బ్యాక్ రౌండ్ నుంచి రాలేదు. ఓ రెస్టారెంట్ విండో నుంచి 5 ఏళ్ల వయసులో తొలిసారి ఈ ఆటను చూసింది. ఆమెకు ఈ ఆట నచ్చడంతో తన తండ్రి ప్రోత్సహించారు.
ఏషియన్ యూత్ గేమ్స్(2013), యూత్ ఒలింప్ గేమ్స్(2014), ఏషియన్ గేమ్స్(2014), 2016 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత తొలి మహిళ గోల్ఫర్ అదితినే కావడం విశేషం. లాలా ఐచా టూర్ స్కూల్ టైటిల్ గెలిచిన అతి చిన్న భారత్ గోల్ఫర్ కూడా అదితినే. టోక్యో ఒలింపిక్స్‌లో గనుక మెడల్ తెస్తే గోల్ఫ్ క్రీడలో మెడల్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అదితి చరిత్రకెక్కనుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.