టోక్యో ఒలింపిక్స్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఒలింపిక్స్‌లో ఓ జూడో మ్యాచ్‌లో తలపడటానికి జర్మనీకి చెందిన జూడో స్టార్ మార్టినా ట్రాడోస్ కోచ్‌తో కలిసి వస్తోంది. ఆమె రింగ్‌లోకి వెళ్లే ముందు తన వెంటే ఉన్న కోచ్ రెండు చేతులతో కాలర్ పట్టుకొని లాగి రెండు చెంపలపై వాయించాడు. ఇది చూసిన వాళ్లంతా షాక్ తిన్నారు. కెమెరాల ముందే ఈ కోచ్ ఏంటి ఇలా చేస్తున్నాడని అంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే ఆ చెంపదెబ్బలు తిన్న మార్టినా మాత్రం ఇది కామనే అని చెప్పడం విశేషం. ఫైట్‌కు ముందు కోచ్ ఇలా చేయడం ఆనవాయితీ అని ఆమె చెప్పడం మరింత షాక్‌కు గురి చేసింది. అది కూడా తాను చెప్పడం వల్లే కోచ్ అలా చేస్తున్నాడని మార్టినా చెప్పింది. ఫైట్‌కు ముందు తాను యాక్టివ్‌గా ఉండటానికి ఇది తనకు అవసరం అని ఆమె అనడం విశేషం. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు కోచ్‌పై మండిపడుతున్నారు.
పోటీల్లో విజయం సాధించాలంటే క్రీడాకారులకు శారీరక ధారుఢ్యంతో పాటూ మానసిక ధృఢత్వం కూడా ముఖ్యమే. ఆట ముగిసే వరకు.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా క్రీడాకారులు తమ ఉత్సాహాన్ని కోల్పోకూడదు. అప్పుడే విజయం వరిస్తుంది. ఇక ఒలింపిక్స్ లాంటి ప్రపంచస్థాయి పోటీల్లో అథ్లెట్లపై ఉండే అంచనాలు, ఒత్తిడి ఎవరూ ఊహించలేని స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు తమకు ఉత్సాహాన్నిచ్చే, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనేక పనులు చేస్తుంటారు. కొందరు తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటే మరికొందరు అదృష్టాన్ని ఇచ్చే ఉంగరమో లేదా మరోకటో ధరిస్తుంటారు. ఇదే కోవలోకి ఈ ఘటన కూడా వస్తోంది. చెంపదెబ్బలు తిన్న మార్టినానే తన కోచ్ ను ఇలా చేయమని చెప్పింది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A czo tu się odpoliczkowało w ogóle?! pic.twitter.com/mX2r9rMMTA
— Mischa Von Jadczak (@michaljadczak) July 27, 2021
ఇక, టోక్యో ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకం నెగ్గుతుందనుకున్న బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ నిరాశపర్చింది. రౌండ్ 16 పోరులో కొలంబియన్ బాక్సర్ వాల్నసీయా విక్టోరియా చేతిలో మేరి కోమ్ ఓటమి పాలైంది. 3-2 తేడాతో మేరీ కోమ్ ఓటమి పాలైంది. జడ్జీలు.. కొలంబియన్ బాక్సర్ వైపే మొగ్గు చూపడంతో భారత్ కు నిరాశ తప్పలేదు. ఐదుగురు న్యాయనిర్ణేతల్లో ముగ్గురు కొలంబియన్ బాక్సర్ వైపే మొగ్గు చూపారు. 30-27, 29 - 28, 27 -30, 29- 28, 28 -29 స్కోర్లు ఇచ్చారు. లండన్ బలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గిన మేరీ కోమ్ ..ఈ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని ఉవ్విల్లూరింది. కానీ, లెజెండ్ బాక్సర్ కు నిరాశ తప్పలేదు. వయస్సు ప్రకారం చూస్తే మేరి కోమ్ కు కచ్చితంగా ఇది చివరి ఒలింపిక్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tokyo Olympics, Viral Video