హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video: ఒలింపిక్స్‌ మ్యాచ్‌ను వదిలేసి బొద్దింకను చూపించిన కెమెరామ్యాన్.. వీడియో వైరల్..

Viral Video: ఒలింపిక్స్‌ మ్యాచ్‌ను వదిలేసి బొద్దింకను చూపించిన కెమెరామ్యాన్.. వీడియో వైరల్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video: ఒలింపిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక క్రీడా పోటీలను కళ్ళకు కట్టినట్టు చూపించడానికి కెమెరామెన్లు చాలా కష్టపడుతుంటారు. ఒక్క షాట్ కూడా మిస్ కాకుండా క్రీడలను షూట్ చేస్తుంటారు. వాస్తవానికి కేవలం క్రీడా సన్నివేశాలను మాత్రమే కాదు ఇతర ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...

వందల మ్యాచ్ లు జరిగే ఒలింపిక్స్‌ నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు బయటకు వస్తుంటాయి. అయితే తాజాగా టోక్యో ఒలింపిక్స్‌ నుంచి ఒక అదిరిపోయే వీడియో తెరమీదకు వచ్చింది. ఇటీవల స్పెయిన్, అర్జెంటీనా మహిళల హాకీ జట్టుల మధ్య ఓ హోరాహోరీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ సమయంలో ఒక కెమెరామ్యాన్ బొద్దింకను చూపించాడు. అది కూడా లక్షలాది ప్రజలు చూసే లైవ్ టీవీ ప్రసారంలో..! దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒలింపిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక క్రీడా పోటీలను కళ్ళకు కట్టినట్టు చూపించడానికి కెమెరామెన్లు చాలా కష్టపడుతుంటారు. ఒక్క షాట్ కూడా మిస్ కాకుండా క్రీడలను షూట్ చేస్తుంటారు. వాస్తవానికి కేవలం క్రీడా సన్నివేశాలను మాత్రమే కాదు ఇతర ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. వీక్షకులకు కొత్తగా ఏదో ఒకటి చూపించి వారిని ఆటలో నిమగ్నమయ్యేలా చేయడమనేది ప్రతీ కెమెరామ్యాన్ చెయ్యాల్సిన పని. దీంతో కెమెరామెన్లు తమకు కొత్తగా కనిపించిన దృశ్యాలను తన కెమెరాల ద్వారా వీక్షకులకు చూపిస్తుంటారు. నిజానికి వారు చూపించే దృశ్యాలు బాగా ఆకట్టుకుంటాయి. గేమ్ చూసి అలసిపోయిన వారికి ఇలాంటి దృశ్యాలు మంచి ఫీలింగ్ ఇస్తాయి.

అయితే ఒక కెమెరామ్యాన్ తనకు కనిపించిన బొద్దింకను జూమ్ చేసి మరీ చూపించాడు. ఆ సమయంలో అర్జెంటీనా, స్పెయిన్ దేశాల మధ్య మహిళల హాకీ మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఒక షాట్ రిప్లై సమయంలో స్క్రీన్ పై బొద్దింక ప్రత్యక్షమయ్యింది. దీంతో.. అరేయ్ ఏంట్రా ఇది అంటూ చాలా మంది వీక్షకులు అవాక్కయ్యారు. ఒక్కసారిగా అందరి దృష్టి ఈ బొద్దింకపైనే పడింది.

అయితే, మ్యాన్ అనే ఒక ట్విట్టర్ యూజర్ ఈ బొద్దింక వీడియోని నెట్టింట షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియోకి 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. రెండున్నర లక్షలకు పైగా లైకులు వచ్చాయి. 55 వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. ఈ వీడియోపై చాలామంది హాస్యాస్పద కామెంట్స్ చేస్తున్నారు. బొద్దింకను చూపించడం ఏంటయ్యా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. గతంలో డిస్కవరీ ఛానల్లో పని చేశావా ఏంటి? అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు మాత్రం బొద్దింక నడకను పర్ఫెక్ట్ గా షూట్ చేశారంటూ కెమెరామ్యాన్ ని పొగుడుతున్నారు. ఏది ఏమైనా, ఒక బొద్దింక వీడియో ఇంటర్నెట్ లో సంచలనంగా మారడం ఆశ్చర్యంగా ఉంది.

First published:

Tags: Sports, Tokyo Olympics, Viral Video

ఉత్తమ కథలు