ఒలింపిక్స్‌కు ఇండియా వెళ్లినప్పుడు అతని పేరు పెద్దగా వినిపించలేదు. పక్కాగా మెడల్ తీసుకొస్తాడన్న లిస్ట్‌లో రవికుమార్ దహియా ( Ravi Kumar Dahiya ) పేరు లేనే లేదు. కానీ అతడు ఎవరూ ఊహించని సంచలన విజయాన్ని సాధించాడు. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్ చేరి దేశానికి కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుత పోరాటంతో ఫైనల్‌కి అర్హత సాధించాడు. సెమీ ఫైనల్లో కజికిస్తాన్‌కి చెందిన నురిస్లామ్ సనయెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతన్ని మట్టి కరిపించాడు రవి దహియా. అయితే, సెమీస్ లో కజికిస్తాన్ రెజ్లర్ మరి స్థాయి దిగజారి ప్రవర్తించాడు. రవి దహియా ఉడుము పట్టును భరించలేక.. మన రెజ్లర్ ను దారుణంగా కొరికాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. నురిస్లామ్ ఎంత కొరికినా.. మనోడు పట్టు వద్దల్లేదు. దీంతో.. నురిస్లామ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు, రవి దహియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ప్రత్యర్థి ఎంత బాధపెట్టినా.. పట్టు సడలించకుండా పతకం సాధించాడని క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అతడు అన్ ఫెయిర్ గా ఆడినా.. నీ సంకల్పంతో గెలిచావంటూ రవి దహియాపై ప్రశంసల వర్షం కురిపించాడు సెహ్వాగ్. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో తొలి పీరియడ్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో కనిపించాడు రవికుమార్ దహియా.అయితే బ్రేక్ తర్వాత ఎదురుదాడి చేసిన సనయెవ్ ఒకేసారి 8 పాయింట్లు సాధించి 2-9 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత వరుస మూడు, రెండు పాయింట్ల సాధించి 7-9 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు రవికుమార్ దహియా.. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లాడు రవికుమార్ దహియా. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్ సుశీల్ కుమార్ తర్వాత ఫైనల్‌కి అర్హత సాధించిన భారత రెజ్లర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రవికుమార్ దహియా.
How unfair is this , couldn’t hit our #RaviDahiya ‘s spirit, so bit his hand. Disgraceful Kazakh looser Nurislam Sanayev.
Ghazab Ravi , bahut seena chaunda kiya aapne #Wrestling pic.twitter.com/KAVn1Akj7F
— Virender Sehwag (@virendersehwag) August 4, 2021
ఇది కూడా చదవండి : ఒలింపిక్స్ లో పతకంతో సత్తా చాటిన దిగ్గజ క్రికెటర్ కొడుకు..
ఇదే దూకుడును ఫైనల్ లో కంటిన్యూ చేస్తే భారత్ కు గోల్డ్ మెడల్ సాధించిన తొలి రెజ్లర్ గా చరిత్ర సృష్టించనున్నాడు రవి దహియా. మనోడి దూకుడు చూస్తుంటే.. ఫైనల్ లో కచ్చితంగా స్వర్ణ పతకం సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tokyo Olympics, Virender Sehwag, Wrestling