వచ్చే నెలలో ఆరంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ చేసే భారతీయ క్రీడాకారులకు తమిళనాడు సీఎం స్టాలిన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. సిల్వర్ పతక విజేతకు రెండు కోట్లు, అలానే కాంస్య పతక విజేతకు ఒక కోటి ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం తెలిపారు. స్థానిక నెహ్రు స్టెడియంలో క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గోన్న స్టాలిన్ ఈ ప్రకటనలు చేశారు . ప్రభుత్వం ఎప్పడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. సీఎం స్టాలిన్ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్లేయర్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి.. ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.
ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, కరణం మల్లేశ్వరి, పిటి.ఉష వాళ్ల రంగాల్లో సత్తా చాటారని, వాళ్లను ఆదర్శంగా తీసుకువాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి.. ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.14 క్రీడా విభాగాలకు మొత్తం 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించారు.
ఈసారి ఒలింపిక్స్ చాలా భిన్నం. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ఒలింపిక్స్ గ్రామంలోని అందరూ ప్రతి రోజూ కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత చూసుకోవాలి, ముఖానికి ముసుగు ధరించాలి. గతంలో భోజన శాలలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండేవాళ్లు, ఇష్టమైన ఆహారం తీసుకుంటూ సరదాగానే కనిపించేవాళ్లు. ఇప్పుడలా కాదు. ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చోవాలి. ఎవరినీ కలవకూడదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత్ నుంచి 100కి పైగా అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MK Stalin, Sports, Tamil nadu, Tokyo Olympics