TOKYO OLYMPICS RUSSIAN SWIMMER EVGENY RYLOV WEARS CAT FACE MASK WHILE RECEIVING GOLD MEDAL AND PICS GOES VIRAL IN SOCIAL MEDIA GH SRD
Tokyo Olympics : ప్రియురాలు ఇచ్చిన క్యాట్ ఫేస్‌మాస్క్‌తోనే మెడల్ అందుకుంటానని స్విమ్మర్ మొండిపట్టు..
Photo Credit : Instagram
Tokyo Olympics : 24 ఏళ్ల రష్యన్ స్విమ్మర్ ఎవ్జెనీ రైలోవ్ టోక్యో ఒలింపిక్స్ పోటీలలో పాల్గొన్నాడు. తన అద్భుతమైన ప్రతిభతో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్ ఈవెంట్లో రికార్డులు సృష్టించాడు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ కు చేరుకున్నాడు. అయితే, గోల్డ్ మెడల్ అందుకునేటప్పుడు అతను చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) నుంచి ఇప్పటికే ఎన్నో వైరల్ మూమెంట్స్ నెట్టింట ప్రత్యక్షమై హల్చల్ చేశాయి. కంగారూలు ఒలింపిక్ గేమ్స్ చూడటం, ఓ అథ్లెట్ బట్టలు కుట్టడం, బ్లాక్ రోబో బాస్కెట్ బాల్ ఆడటం, ఆస్ట్రేలియన్ స్విమ్మింగ్ కోచ్ విజయానందంలో ఎగిరి గంతేయడం వంటి ఎన్నో క్షణాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఒక అథ్లెట్ చేసిన పని కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. రష్యాకు చెందిన ఎవ్జెనీ రైలోవ్ అనే స్విమ్మర్.. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో గెలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. ఎవ్జెనీ పతకం తీసుకునేటప్పుడు.. క్యాట్ ఫేస్‌మాస్క్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో అతడు గోల్డ్ మెడల్ తీసుకుంటున్న క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 24 ఏళ్ల రష్యన్ స్విమ్మర్ ఎవ్జెనీ రైలోవ్ టోక్యో ఒలింపిక్స్ పోటీలలో పాల్గొన్నాడు. తన అద్భుతమైన ప్రతిభతో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్ ఈవెంట్లో రికార్డులు సృష్టించాడు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ కు చేరుకున్నాడు. ఫైనల్లో కూడా ఎవ్జెనీ తన తోటి దేశస్థుడు క్లిమెంట్ కొలెస్నికోవ్ను కేవలం 0.02 సెకన్ల తేడాతో ఓడించాడు. దీంతో బంగారు పతకం ముద్దాడే అదృష్టాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు 25 ఏళ్ల తరువాత స్విమ్మింగ్ ఈవెంట్లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన మొదటి రష్యన్ గా చరిత్ర సృష్టించాడు.
అయితే ఇతడు మెడల్ సెర్మనీ పోడియం వద్దకు వచ్చి స్వర్ణ పతకాన్ని అందుకోవడానికి నిరాకరించాడు. క్యాట్-ప్రింట్ ఫేస్ మాస్క్ ధరించి మాత్రమే వస్తానని పట్టుపట్టాడు. అందుకు ఒలింపిక్స్ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. మరొక ఫేస్‌మాస్క్ ధరించాలి అని చెప్పారు. దీంతో సదరు క్రీడాకారుడు ఏడుపు మొహం పెట్టుకున్నాడు. తనకిష్టమైన ఫేస్‌మాస్క్ ధరించడానికి వీలు లేదని చెప్పినా కూడా అతడు వాగ్వాదానికి దిగే పరిస్థితిలో లేడు. ఒకవేళ అలా వాగ్వాదానికి దిగినా.. కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతలు పోయి చెడ్డ పేరు వస్తుంది.
అయితే కొంత సమయం తర్వాత ఒలింపిక్స్ నిర్వాహకులు ఎవ్‌జెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎవ్జెనీ తనకెంతో ఇష్టమైన క్యాట్-ప్రింట్ ఫేస్ మాస్క్ ధరించి పోడియం వద్దకు చేరుకున్నాడు. దాంతో క్రీడా అభిమానులు అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సదరు క్రీడాకారుడు అదే ఫేస్‌మాస్క్ ధరించి స్వర్ణ పతకం అందుకున్నాడు. దీంతో క్షణాల్లోనే అతడి ఫొటోలో, వీడియోలు వైరల్ గా మారాయి. నెట్టింట అతని ఫేస్‌మాస్క్ గురించి పెద్ద చర్చ జరిగింది.
ఈ ఫేస్‌మాస్క్ ని ప్రియురాలు రైలోవ్కు బహుమతిగా ఇచ్చిందట. ఈమెకు పిల్లులంటే మహా ఇష్టం. తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పిల్లులకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రైలోవ్కు కూడా పిల్లులంటే అత్యంత ఇష్టం. అతడి ఇన్ స్టాగ్రామ్ మొత్తం పోస్టుల్లో పిల్లులకు సంబంధించిన పోస్టులే సగానికి పైగా ఉన్నాయి. దీన్ని బట్టి అతడికి పిల్లులు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఆ ఇష్టంతోనే ఒలింపిక్స్ లో కూడా క్యాట్-ప్రింట్ మాస్క్ ధరించి ఆశ్చర్యపరిచాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.