హోమ్ /వార్తలు /క్రీడలు /

PV Sindhu: కాంస్యం గెలిచిన సింధు.. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు.. ప్రముఖులు ఏమన్నారంటే..

PV Sindhu: కాంస్యం గెలిచిన సింధు.. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు.. ప్రముఖులు ఏమన్నారంటే..

పీవీ సింధు (Image:PTI)

పీవీ సింధు (Image:PTI)

PV Sindhu: గత ఒలిపింక్స్‌లోనూ సింధూ పతకం సాధించిన విషయం తెలిసిందే. రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం సింధూ అదరగొట్టింది. మన దేశానికి మరో మెడల్ సాధించిపెట్టింది. సెమీస్‌లో ఓడిపోయినా.. కాంస్య పతకానికి జరిగిన పోటీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. చైనా షట్లర్ బింగ్ జియావో‌పై వరుస సెట్లలో విజయం సాధించింది. 21-13, 21-15 తేడాతో గెలిచి కాంస్య పతకాన్ని అందుకుంది. నిన్నటి గేమ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకొని ఇవాళ చాలా యాక్టివ్‌గా కనిపించింది. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గేమ్‌ను అద్భుతంగా ఫినిష్ చేసింది. ఈ పతకంతో సింధూ చరిత్ర సృష్టించింది. మన దేశంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి మహిళగా రికార్డులకెక్కింది.

మన తెలుగు బిడ్డ కాంస్య పతకం సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాహుల్ గాంధీ, ఏపీ, తెలంగాణ సీఎంలు సింధూ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.


గత ఒలిపింక్స్‌లోనూ సింధూ పతకం సాధించిన విషయం తెలిసిందే. రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. ఈసారి గోల్డ్ మెడల్ గెలుస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ సెమీ ఫైనల్‌లో ఓడిపోవడంతో బంగారంతో పాటు వెండి పతకాలు చేజారాయి. కాంస్యం కోసం జరిగిన పోరులో అద్భుతంగా ఆడి మెడల్ గెలిచింది పీవీ సింధు.

First published:

Tags: Badminton, Pv sindhu, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు