హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ సమయంలో ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలే.. ప్రేక్షకుల నిబంధనలు విడుదల

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ సమయంలో ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలే.. ప్రేక్షకుల నిబంధనలు విడుదల

టోక్యో ఒలింపిక్స్‌కు పరిమిత సంఖ్యలో స్వదేశీ ప్రేక్షకులను అనుమతించేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే కఠినమైన నిబంధనలను అమలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

టోక్యో ఒలింపిక్స్‌కు పరిమిత సంఖ్యలో స్వదేశీ ప్రేక్షకులను అనుమతించేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే కఠినమైన నిబంధనలను అమలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

టోక్యో ఒలింపిక్స్‌కు పరిమిత సంఖ్యలో స్వదేశీ ప్రేక్షకులను అనుమతించేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే కఠినమైన నిబంధనలను అమలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

  టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) ప్రారంభానికి మరి కొన్ని రోజులే సమయం ఉన్నది. ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ (Olympic Organizing Committee) ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కరోనా పాండమిక్ కారణంగా విదేశీ ప్రేక్షకులను అనుమతి లేకపోయినా జపాన్ వాసులు మాత్రం వచ్చి ఆటలను స్టేడియంలో (Stadium) వీక్షించడానికి అనుమతి ఇచ్చింది. పరిమిత సంఖ్యలో స్వదేశీ ప్రేక్షకులు స్టేడియంలలో అనుమతి రావడంతో చాలా మంది ఉత్సాహంగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే కరోనా నిబందనలు మాత్రం కఠినంగా అమలు చేస్తామని నిర్వహక కమిటీ చెప్పింది. దీనికి సంబంధించిన నిబంధనలను బుధవారం వెల్లడించింది. వైద్య నిపుణులు చేసిన సూచనల మేరకే ఈ నిబంధనలు రూపొందించినట్లు నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు షీకో హషిమోటో వెల్లడించారు. స్టేడియంలో మద్యపానం, కేరింతలు కొట్టడం, కరచాలనం చేయడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. ప్రతీ రోజు కేవలం 10 వేల మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతి ఇస్తామని.. ప్రతీ ఒక్కరు నిబంధనలు తప్పక పాటించాలని ఆమె పేర్కొన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎంట్రీ పాయింట్ల వద్ద ఉష్ణోగ్రతలు చెక్ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తామని ఆమె అన్నారు.

  'యూరో 2020లో ప్రేక్షకులను భారీ సంఖ్యలో అనుమతిస్తున్న విషయాన్ని మేము గమనించాము. కానీ దురదృష్ట వశాత్తు మేము అలా చేయలేకపోతున్నాము. సాధ్యమైనంత వరకు అథ్లెట్ల ఆరోగ్యాలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాము' అని హషిమోటో అన్నారు. ప్రేక్షకులు టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి. అంతే కానీ అటు ఇటు తిరగడానికి వీలుండదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే బయటకు పంపిస్తారు. అంతే కాకుండా మిగతా రోజుల్లో వాళ్లు స్టేడియంలోనికి వచ్చేందుకు అనుమతించరు. ఇక ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ప్లే బుక్ పేరుతో నిబంధనలు విడుదల చేసింది. అథ్లెట్లు కూడా కరచాలనం, కౌగిలించుకోవడం, మాస్కులు దరించక పోవడంపై కఠిన నిబంధనలు విధించారు. ఒలింపిక్ విలేజ్‌లో కూడా కఠినంగా నిబంధనలు అమలు కానున్నాయి.

  MS Dhoni Simla House : సిమ్లాలో ఎంఎస్ ధోనీ ఇల్లు చూశారా? కొండల నడుమ అందమైన ఉడెన్ హౌస్

  ఇక ఇండియా నుంచి దాదాపు 100 మంది అథ్లెట్లు టోక్యో వెళ్లనున్నారు. భారత క్రీడాకారులకు స్పూర్తి నింపేందుకు రూపొందించిన 'లక్ష్య తేరా సామ్నే హై' అనే థీమ్ సాంగ్‌ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. సినీ సంగీత దర్శకుడు మోహిత్ చౌహాన్ స్వరపరిచారు. త్వరలోనే భారత అథ్లెట్ బృందం టోక్యో ప్రయాణం కానున్నది. అక్కడ చేరుకున్న వెంటనే మూడు రోజుల పాల క్వారంటైన్‌లో ఉంటుంది. అనంతరం కోవిడ్ పరీక్షలు చేయించుకొని క్రీడా గ్రామంలో తమకు కేటాయించిన బస దగ్గరకు వెళ్లనున్నారు.

  First published:

  Tags: Tokyo Olympics

  ఉత్తమ కథలు