టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olymnpics) భారత వెయిట్ లిఫ్టర్ (Weight Lifter) మీరాబాయ్ చాను (Mirabai Chanu) 49 కేజీలా విభాగంలో రజత పతకం (Silver Medal) గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలో చైనాకు చెందిన జీహో జీజీ స్వర్ణ పతకం గెలుచుకున్నది. అయితే ఆమెను డోప్ టెస్టు చేయించుకోవాలని టోక్యో నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ చైనా వెయిట్ లిఫ్టర్ కనుక డోప్ టెస్టులో విఫలం అయితే మీరాబాయ్ చాను స్వర్ణ పతకం గెలిచే అవకాశం ఉంటుంది. 'టోక్యోలో స్వర్ణం గెలిచిన జీహో జీజీని డోప్ టెస్టు చేయించు కోవాలని నిర్వాహక కమిటీ చెప్పింది. ఈ టెస్టు తప్పని సరిగా జరపాల్సిందే.' అని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. జీహో జీజీ టోక్యో ఒలింపిక్స్‌లో 210 కేజీల బరువు ఎత్తింది. అదే సమయంలో మీరాబాయ్ చాను స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్ అండ్ జర్క్‌లో 115 కేజీలు మొత్తం 202 కేజీలు ఎత్తింది. ఇక ఇండోనేషియాకు చెందిన విండీ కాంటిక 194 కేజీల బరువు ఎత్తి కాంస్ పతకం దక్కించుకున్నది.
కాగా, చాను టోక్యో నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చింది. తాను ఈ పతకం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నదని.. కుటుంబాన్ని కలసి తన సంతోషాన్ని పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు జీహో జీజీని డోప్ టెస్టు పూర్తయ్యే వరకు టోక్యో వదలి వెళ్లవద్దని నిర్వాహకులు ఆదేశించారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.