ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 14వ రోజుకు చేరుకుంది. జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఈ అత్యుత్తమ క్రీడా వేదికలో భారత అథ్లెట్లు తమ పతకాల వేటలో పడ్డారు. టోక్యో ఒలింపిక్స్ 53 కిలోల కేటగిరీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. నిరాశపర్చింది. క్వార్టర్ ఫైనల్ లో వెనీసా కల్దిజిన్ స్కా చేతిలో ఓడిపోయింది. 9-3 తేడాతో బెలారస్ ప్లేయర్ చేతిలో ఖంగుతింది వినేశ్. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది వెనీసా. చివరికి ఫాల్ పద్దతిలో నెగ్గింది వెనీసా కల్దిజిన్ స్కా. అంతకుముందు..స్వీడెన్ రెజ్లర్ సోఫియా మాట్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-1 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది వినేష్ ఫోగట్. 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా భారీ అంచనాలతో బరిలో దిగిన వినేష్ పోటీ మధ్యలో గాయపడింది. గాయం తీవ్రత కారణంగా లేవడానికి కూడా కష్టపడిన వినేష్, స్ట్రెచర్ మీద బయటకు వెళ్లి, ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలిసి వచ్చింది. 2016లో 50 కిలోల కేటగిరీలో పోటీపడ్డ వినేష్, 2019 లో 50 కిలోల కేటగిరీ నుండి 53 కిలోల కేటగిరీకి మారింది. ఒలింపిక్స్‌కి కేవలం 18 నెలల ముందు ఇలా వెయిట్ కేటగిరీని మార్చుకోవడం పెనుసవాలే అయినప్పటికీ... తన ప్రతికూలతలపై విజయం సాధించి అధిక వెయిట్ కేటగిరీలో పోరాడడానికి అలవాటుపడింది.
అంతకుముందు తొలి రౌండ్లో ఓడిన భారత రెజ్లర్ అన్షూ మాలిక్‌కి రెపఛేజ్ దక్కినా, దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, చెక్ రిపబ్లిక్కి చెందిన వలరియా కోబ్లోవాతో జరిగిన మ్యాచ్‌లో 1-5 తేడాతో పోరాడి ఓడింది అన్షూ.ఆఖరి 30 సెకన్లలో 4 పాయింట్లు సాధించిన వలరియా, అన్షూపై విజయం సాధించింది. ఈ పరాజయంతో అన్షూ మాలిక్ నిరాశగా ఇంటిదారి పట్టింది. దీంతో టీమిండియాకు మరో పతకాన్ని అందించే అవకాశాన్ని చేజార్చింది అన్షు మాలిక్.
#Wrestling Update
Vinesh goes down to #BLR Vanesa Kaladzinskaya in the Quarterfinal match of Women's 53kg Freestyle.#Tokyo2020 #Olympics
— SAIMedia (@Media_SAI) August 5, 2021
మరోవైపు, భారత కుస్తీ వీరుడు రవి కుమార్ దహియా పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరుకున్నాడు. దీంతో భారత్ కు మరో పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్ లో కూడా అతని చెలరేగితే టీమిండియా గోల్డ్ అందించిన రెజ్లర్ గా చరిత్ర సృష్టిస్తాడు.
Tags: Tokyo Olympics, Wrestling