TOKYO OLYMPICS LIVE UPDATES WRESTLING RAVI KUMAR DAHIYA ENTERS IN TO FINAL SRD
Tokyo Olympics : వారెవ్వా రవి కుమార్ దహియా.. ఫైనల్ కు కుస్తీ వీరుడు.. భారత్ కు మరో పతకం ఖాయం..
Tokyo Olympics
Tokyo Olympics : ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 13వ రోజుకు చేరుకుంది. జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఈ అత్యుత్తమ క్రీడా వేదికలో భారత అథ్లెట్లు తమ పతకాల వేటలో పడ్డారు.
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 13వ రోజుకు చేరుకుంది. జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఈ అత్యుత్తమ క్రీడా వేదికలో భారత అథ్లెట్లు తమ పతకాల వేటలో పడ్డారు. 13వ రోజు పలు చిరస్మరణీయమైన విజయాలను భారత తన ఖాతాలో వేసుకుంది. భారత కుస్తీ వీరుడు రవి కుమార్ దహియా తన ప్రత్యర్థులపై విరుచుకుని పడ్డాడు. బ్యాక్ అండ్ బ్యాక్ బౌట్స్‌లో రెచ్చిపోయాడు. వారిని మట్టి కరిపించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరుకున్నాడు. దీంతో భారత్ కు మరో పతకం ఖాయం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుత పోరాటంతో ఫైనల్‌కి అర్హత సాధించాడు. సెమీ ఫైనల్లో కజికిస్తాన్‌కి చెందిన నురిస్లామ్ సనయెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి పీరియడ్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో కనిపించాడు రవికుమార్ దహియా.
అయితే బ్రేక్ తర్వాత ఎదురుదాడి చేసిన సనయెవ్ ఒకేసారి 8 పాయింట్లు సాధించి 2-9 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత వరుస మూడు, రెండు పాయింట్ల సాధించి 7-9 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు రవికుమార్ దహియా.. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లాడు రవికుమార్ దహియా. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్ సుశీల్ కుమార్ తర్వాత ఫైనల్‌కి అర్హత సాధించిన భారత రెజ్లర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రవికుమార్ దహియా.
RAVI ADVANCES TO FINAL!!#IND#RaviDahiya advances to the Final of Men’s freestyle 57 Kg by Victory by fall (VFA) against #KAZ Nurislam Sanayev
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో తొలుత అతను 1/8 ఫైనల్ రౌండ్లో నైజీరియాకు చెందిన ఎకెరెకెమె అగియోమోర్‌ను చిత్తు చేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టాడు.అక్కడ కూడా అతనికి ఎదురు లేకుండా పోయింది. ఈ క్వార్టర్ ఫైనల్స్‌లో రవి దహియా.. బల్గేరియాకు చెందిన జార్గీ వెంగెలోవ్కు పరాజయాన్ని రుచి చూపించాడు. సుడిగాలిలా విజృంభించాడు. 14-4 తేడాతో క్వార్టర్స్ ఫైనల్స్‌ను గెలిచాడు రవి దహియా.. దర్జాగా సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు సెమీఫైనల్ లో ప్రత్యర్థిని చిత్తు చేసి.. భారత్ కు మరో పతకాన్ని ఖాయం చేశాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.