ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 13వ రోజుకు చేరుకుంది. జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఈ అత్యుత్తమ క్రీడా వేదికలో భారత అథ్లెట్లు తమ పతకాల వేటలో పడ్డారు. ఇక, సెమీస్ లో భారత్ రెజ్లర్ దీపక్ పునియాకు ఓటమి ఎదురైంది. సెమీస్ లో అతడు 0-10 తేడాతో ఓటమి పాలయ్యాడు. అమెరికా కుస్తీ వీరుడు టేలర్ డేవిడ్ మోరిస్ సాంకేతికంగా ఆధిపత్యం సాధించాడు. ఇక, దీపక్ కాంస్యం కోసమే పోరాడనున్నాడు. మరోవైపు, భారత కుస్తీ వీరుడు రవి కుమార్ దహియా మాత్రం తన ప్రత్యర్థులపై విరుచుకుని పడ్డాడు. బ్యాక్ అండ్ బ్యాక్ బౌట్స్‌లో రెచ్చిపోయాడు. వారిని మట్టి కరిపించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరుకున్నాడు. దీంతో భారత్ కు మరో పతకం ఖాయం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుత పోరాటంతో ఫైనల్‌కి అర్హత సాధించాడు. సెమీ ఫైనల్లో కజికిస్తాన్‌కి చెందిన నురిస్లామ్ సనయెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి పీరియడ్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో కనిపించాడు రవికుమార్ దహియా.
అయితే బ్రేక్ తర్వాత ఎదురుదాడి చేసిన సనయెవ్ ఒకేసారి 8 పాయింట్లు సాధించి 2-9 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత వరుస మూడు, రెండు పాయింట్ల సాధించి 7-9 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు రవికుమార్ దహియా.. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లాడు రవికుమార్ దహియా. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్ సుశీల్ కుమార్ తర్వాత ఫైనల్‌కి అర్హత సాధించిన భారత రెజ్లర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రవికుమార్ దహియా.
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో తొలుత అతను 1/8 ఫైనల్ రౌండ్లో నైజీరియాకు చెందిన ఎకెరెకెమె అగియోమోర్‌ను చిత్తు చేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టాడు.అక్కడ కూడా అతనికి ఎదురు లేకుండా పోయింది. ఈ క్వార్టర్ ఫైనల్స్‌లో రవి దహియా.. బల్గేరియాకు చెందిన జార్గీ వెంగెలోవ్కు పరాజయాన్ని రుచి చూపించాడు. సుడిగాలిలా విజృంభించాడు. 14-4 తేడాతో క్వార్టర్స్ ఫైనల్స్‌ను గెలిచాడు రవి దహియా.. దర్జాగా సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు ఫైనల్ కి చేరి భారత్ కు మరో పతకాన్ని ఖాయం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tokyo Olympics, Wrestling