జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 15వ రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. అయితే, రెజ్లింగ్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. సెమీఫైనల్ లో బజరంగ్ పునియా పోరాడి ఓడిపోయాడు. సెమీ ఫైనల్స్‌లో బజరంగ్ పునియా అజర్‌బైజాన్‌కు చెందిన హాజీ అలియేవ్ చేతిలో ఓడిపోయాడు. ఇక, కాంస్యం కోసం జరిగే పోరులో తలపడనున్నాడు బజరంగ్ పునియా. హాజీ అలియేవ్.. ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడి బజరంగ్ మీద ఒత్తిడి పెంచాడు. హాజీ అలియేవ్.. 12-5 తేడాతో బజరంగ్ పై నెగ్గాడు. హాజీ అలియేవ్.. అల్లాటప్పా రెజ్లర్ కాదు. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్. 2016లో రియో డి జనేరియోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సైతం ముద్దాడాడతను. 2014, 2015, 2017ల్లో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ విన్నర్. అలాంటి హాజీ అలయేవ్ సెమీస్ లో బజరంగ్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌లో జపాన్‌కి చెందిన టకుటో ఒటోగురోతో మ్యాచ్ ఆడబోతున్నాడు బజరంగ్ పూనియా.
Great effort! #Wrestling: Bajrang Punia loses to Haji Aliyev 5-12 in Semi-Final.
Bajrang Punia will now fight for Bronze medal. #TeamIndia | #Cheer4India | #Tokyo2020 pic.twitter.com/pT0ukgpQBD
— Doordarshan Sports #TokyoOlympics (@ddsportschannel) August 6, 2021
ఇది కూడా చదవండి : ఆరు నెలల నుంచి భార్య ముఖం కూడా చూడలేదు.. చివరికి ది గ్రేట్ వాల్ అన్పించుకున్నాడు..
అంతకు ముందు జరిగిన రెండు రెజ్లింగ్ బౌట్లలోనూ బ్యాక్ అండ్ బ్యాక్ విజయాలను అందుకున్నారు. ఈ రెండింట్లోనూ ఆయన చూపిన పోరాటం.. అసాధారణం. ఏ ఒక్క బౌట్‌లో వెనుకంజ వేసిన పతకంపై కోట్లాది మంది భారతీయుల ఆశలు గల్లంతయ్యేదే. అలాంటి కీలక బౌట్లలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడప బజరంగ్. తొలుత- పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 1/8 ఫైనల్ రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ బౌట్‌ను ఏకపక్షంగా మార్చివేశారు. కిర్గిజిస్తాన్‌కు చెందిన ఎర్నజార్బఅకమటలియేవ్‌పై తిరుగులేని విజయాన్ని ఆర్జించాడు. ఈ విజయంతో ఆయన క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తన ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరాన్‌కు చెందిన కుస్తీ వీరుడు మోర్తెజా హసన్ అలీ ఛెకా ఘియాసీనీ ఓడించాడు. మోర్తెజా ఘియాసీకి ఇదే తొలి ఒలింపిక్స్. అతణ్ని ఓడించి పునియా సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tokyo Olympics, Wrestling