హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : ర్యాంక్ ఎంత అన్నది కాదన్నా ముఖ్యం.. గోల్డ్ కొట్టామా లేదా ..? చరిత్ర సృష్టించిన కుర్రాడు..

Tokyo Olympics : ర్యాంక్ ఎంత అన్నది కాదన్నా ముఖ్యం.. గోల్డ్ కొట్టామా లేదా ..? చరిత్ర సృష్టించిన కుర్రాడు..

Photo Credit : AFP

Photo Credit : AFP

Tokyo Olympics : క్రీడారంగంలో హీరోలు జీరోలు అవ్వొచ్చు. జీరోలు హీరోలు అవ్వొచ్చు. అలాంటి సంచలనమే విశ్వక్రీడల వేదికపై నమోదైంది.

క్రీడారంగంలో హీరోలు జీరోలు అవ్వొచ్చు. జీరోలు హీరోలు అవ్వొచ్చు. అలాంటి సంచలనమే విశ్వక్రీడల వేదికపై నమోదైంది. ఆదివారం జరిగిన 400 మీటర్ల ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌లో ఏమాత్రం అంచనాలు లేని ట్యునీషియాకు చెందిన 18 ఏళ్ల అహ్మద్‌ అయూబ్‌ హఫ్నాయ్‌ ఏకంగా స్వర్ణ పతకం సాధించి అందరిని అబ్బురపరిచాడు. ఈ రేసును 3 నిమిషాల 43.36 సెక‌న్ల‌లో పూర్తి చేసిన అతను ఒలింపిక్స్‌ రికార్డును నెలకొల్పాడు. దీంతో ఈసారి గోల్డ్ కొడదామనుకున్న ఆస్ట్రేలియా స్విమ్మర్‌ జాక్‌ మెక్లౌగ్లిన్‌కు నిరాశే ఎదురైంది. ఈసారి విశ్వ క్రీడల్లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి మెక్లౌగ్లిన్‌.. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 400 మీటర్ల ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌లో 2019లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ట్యునీషియాకు చెందిన అహ్మద్‌ అయూబ్‌ హఫ్నాయ్‌ది 100వ స్థానం. ఆ తరువాత అతి కష్టం మీద ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ప్రస్తుత ఒలింపిక్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా పూల్‌లోకి దిగిన హఫ్నాయ్‌.. తొలి ప్రయత్నంలోనే స్వర్ణం సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వాస్తవానికి హఫ్నాయ్‌ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అనుకోకుండా అతని లక్ష్యం మూడేళ్ల ముందుగానే సాకారమైంది.

ఒలింపిక్స్‌లో మొదటి సారి పాల్గొన్నా.. ఆ భయం, బిడియం ఏమాత్రం అతనిలో కనపడలేదు. రాకెట్ వేగంతో దూసుకుపోయి అంతర్జాతీయ పతకాల పట్టికను స్వర్ణంతో మొదలుపెట్టాడు అహ్మద్‌ అయూబ్‌. విశ్లేషకుల అంచనాలను తారుమారు చేసి హీరో అయ్యాడు.


" నన్ను నేను నమ్మలేకపోతున్నాను. నా కల సాకారమైంది. నా జీవితంలో ఇదే అత్యుత్తమ రేసు. నీటిలో నిన్నటి కంటే ఈరోజు చాలా మెరుగ్గా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ గెలుస్తాననుకోలేదు. ఆ దేవుడికి కృతజ్ఞతలు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు" ని అహ్మద్‌ అయూబ్‌ హాఫ్నాయ్‌ తెలిపాడు. హఫ్నాయ్‌ తండ్రి బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు. అందుకే 18 ఏళ్ల హఫ్నాయ్‌ చిన్నపటినుంచే క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. ఇక ఒలింపిక్స్‌ చరిత్రలో ట్యునీషియాకు లభించిన ఐదో స్వర్ణ పతకం ఇది.

First published:

Tags: Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు