హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : ఈ ఆర్మీ జోడి సూపర్ .. పతకానికి దగ్గరగా భారత రోయిర్లు.. సెమీస్ లోకి ఎంట్రీ..

Tokyo Olympics : ఈ ఆర్మీ జోడి సూపర్ .. పతకానికి దగ్గరగా భారత రోయిర్లు.. సెమీస్ లోకి ఎంట్రీ..

Tokyo Olympics (Photo Credit : Twitter)

Tokyo Olympics (Photo Credit : Twitter)

Tokyo Olympics : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) లో భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయ్. పతకాలు కొడతారనుకున్న అథ్లెట్లు ఇంటి బాట పడుతుంటే.. పతకంపై పెద్దగా ఆశలేవీ లేని కేటగీరీలో ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు.

  ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) లో భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయ్. పతకాలు కొడతారనుకున్న అథ్లెట్లు ఇంటి బాట పడుతుంటే.. పతకంపై పెద్దగా ఆశలేవీ లేని కేటగీరీలో ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఆట మొదలైన రెండో రోజే మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని ముద్దాడింది. ఇక, లేటెస్ట్ గా మెడల్ సాధించడానికి అతి చేరువైంది. ఇందులో పతకాన్ని సాధించ గలిగితే.. అది రికార్డే అవుతుంది. ఇప్పటిదాకా మన చేతికి అందని కేటగిరీలో తొలిసారిగా మెడల్‌ కొట్టినట్టవుతుంది. పురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్ రీప్ ఛెజ్ విభాగంలో భారత రోయర్లు సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టారు. నిజానికి- ఎవరూ ఊహించని కేటగిరీ ఇది. దీనికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రోయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ ఈ ఘనతను సాధించింది. అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ ఆర్మీ సోల్జర్స్ . జపాన్ సీ ఫారెస్ట్ వాటర్ వేలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎవరూ ఊహించని విధంగా విజయ పతాకాన్ని ఎగురవేసింది ఈ జోడీ. పోలెండ్‌కు చెందిన జెర్జీ కోవాల్స్కీ, అర్థర్ మికోలాజ్చెవ్స్కీ జోడీ తొలి స్థానంలో నిలిచింది. స్పెయిన్ రెండో స్థానాన్ని ఆక్రమించింది.

  భారత్ మూడోస్థానానికి చేరుకుంది. ఇందులో సెమీ ఫైనల్‌లో విజయం సాధించితే కాంస్య పతకం ఖాయం. ఫైనల్‌కు చేరగలిగితే రజతం.. అందులో విజయం సాధించగలిగితే గోల్డ్ మెడల్ భారత మెడలో పడినట్టే. తమ ల్యాపింగ్‌ను పోలెండ్ జంట 6:43:44 నిమిషాల్లో పూర్తి చేసి.. టేబుల్ టాప్‌గా నిలిచింది. 6:45:71 నిమిషాల్లో లక్ష్యాన్ని అధిగమించిన స్పెయిన్ రెండో స్థానంలో నిలవగా.. 6:51:36 నిమిషాల్లో ల్యాపింగ్‌ను పూర్తి చేసిన భారత రోయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ మూడో స్థానానికి చేరుకుంది. ఆ తరువాతి స్థానంలో ఉజ్బెకిస్తాన్ నిలిచింది. 6:56:22 నిమిషాలకు గమ్యాన్ని చేరింది.


  ఇక, ఈ ఒలింపిక్స్ లో భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజత పతకం సాధించగా.. పీవీ సింధు, మనికా బాత్రా, మేరీ కోమ్ లాంటి టాప్ ప్లేయర్స్ మెడల్స్ సాధించే దిశగా దూసుకెళుతున్నారు. మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్లు మాత్రం విఫలమవుతున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Sports, Tokyo Olympics

  ఉత్తమ కథలు