హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : బాక్సింగ్ లో భారత్ కు తీవ్ర నిరాశ... ఒలింపిక్స్ నుంచి పూజా రాణి ఔట్ ..

Tokyo Olympics : బాక్సింగ్ లో భారత్ కు తీవ్ర నిరాశ... ఒలింపిక్స్ నుంచి పూజా రాణి ఔట్ ..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Tokyo Olympics : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ లో పూజా రాణి ఓడింది.

  ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. ఇప్పటికే స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ఓడిపోగా.. ఇక, లేటెస్ట్ గా భారత బాక్సర్ పూజా రాణి (Pooja Rani) క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయింది. 8 వ రౌండ్‌లో చైనాకు చెందిన లిన్ కియాన్ తో తలపడిన పూజారాణి 5-0 తో ఓడిపోయింది. పూజా ప్రత్యర్థి లిన్ కియాన్ తన పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్​ చూపెట్టింది. తిరుగులేని పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పూజా చిత్తు చేసి మహిళల మిడిల్ (69-75 కిలోలు) విభాగంలో సెమీ ఫైనల్ లోకి ప్రవేశించింది. నెక్స్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు తో ఆడిన లిన్ కియాన్.. పూజాకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. పవర్ పంచ్ లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది.

  ఇక, మహిళల బాక్సింగ్ వాల్టర్ వెయిట్ (64 కేజీల నుంచి 69 కేజీల) విబాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ (Lovlina Borgohain) సెమీఫైనల్ చేరుకున్నది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా చైనీస్ తైపీకి చెందిన చెన్ నీచిన్‌పై గెలుపొందింది. జడ్జీలు 4-1తో లవ్లీనా వైపు మొగ్గు చూపారు. ఒలింపిక్స్‌లో పతకం తెస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్న స్టార్ బాక్సర్ మేరీకోమ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడిపోయింది. దీంతో భారతీయుల ఆశలు అడియాశలయ్యాయి. అయితే, నేనున్నానంటూ 23 ఏళ్ల అస్సామ్ అమ్మాయి నిరూపించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో లవ్లీనా బోర్గెహెన్ చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్ చిన్‌పై 4-1 తేడాతో విజయం సాధించి పతకం ఖాయం చేసుకున్నది. ఒక వేళ సెమీస్‌లో గెలిస్తే కాంస్యానికి మించిన పతకమే దక్కుతుంది. ఇక ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో పతకం తేనున్న మొదటి బాక్సర్‌గా రికార్డు సృష్టించనుంది. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్యం అందించిన లవ్లీనా.. ఇప్పుడు దేశానికి ఒలింపిక్ పతకం అందించనుంది. ఆగష్ట్ 4న లవ్లీనా టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనిల్‌తో తలపడనుంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Boxing, Sports, Tokyo Olympics

  ఉత్తమ కథలు