ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ లో మహిళా భారత బాక్సర్ల దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే బాక్సర్ లవ్ లీనా క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లగా.. సీనియర్ బాక్సర్ మేరీకోమ్ తొలి రౌండ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. ఇక, లేటెస్ట్ గా భారత బాక్సర్ పూజా రాణి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 16 వ రౌండ్‌లో అల్జీరియాకు చెందిన ఇచ్రాక్ చైబ్ తో తలపడిన పూజారాణి 5-0 తో గెలుపొందింది. పూజా తన పంచ్ పవర్ చూపెట్టింది. తిరుగులేని పెర్ఫామెన్స్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసి మహిళల మిడిల్ (69-75 కిలోలు) విభాగంలో క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. నెక్స్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టింది. మొదటి నుంచి పూజారాణి పై భారీ అంచనాలు ఉన్నాయి. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు తో ఆడిన పూజా రాణి.. ప్రత్యర్థికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. పవర్ పంచ్ లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఇదే దూకుడు పూజా నెక్ట్స్ మ్యాచ్ ల్లో కూడా కంటిన్యూ చేస్తే భారత్ కు మరో పతకం గ్యారెంటీ అని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
ఒక వైపు ఒలింపిక్స్‌లో మహిళా బాక్సర్లు రెచ్చిపోతుంటే.. పురుషుల మాత్రం నిరాశపర్చిన సంగతి తెలిసిందే. పురుషుల విభాగంలో ఆశీష్ కుమార్, వికాస్ కృష్ణన్, మనీశ్ కౌషిక్ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం విశేషం.
.@BoxerPooja starts off her #Tokyo2020 campaign with a solid performance over Algeria's Ichrak Chaib, winning the bout 5-0.
Wishing her all the best for her upcoming bouts!#Boxing #Olympics #Cheer4India pic.twitter.com/zeOsCsR9iA
— SAIMedia (@Media_SAI) July 28, 2021
India’s @ImDeepikaK wins against Jennifer Mucino Fernandez of USA in a 6-4 thriller to qualify for the next round. Stay tuned for more updates.#Archery #Olympics #Cheer4India pic.twitter.com/FYxNc9Wh71
— SAIMedia (@Media_SAI) July 28, 2021
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ 2020లో వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారి, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన ఆర్చర్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-4 తేడాతో విజయం సాధించింది దీపికా కుమారి. ఐదు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దీపికా కుమారి పెద్దగా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా ఆమె అనుభవం, యంగ్ ఆర్చర్‌ను ఓడించడానికి ఉపయోగపడింది. అంతకుముందు మెన్స్ సింగిల్స్ ఈవెంట్‌లో భారత ఆర్చర్ ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ రౌండ్ 16లో ఓడిపోయారు. ఇక, పీవీ సింధు కూడా తన ప్రత్యర్థి చిత్తు చేసి ప్రి క్వార్టర్స్ కి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తానికి పురుష అథ్లెట్లు నిరాశపరుస్తున్నా.. మహిళా అథ్లెట్లు మాత్రం పతకాలు ఆశలు నిజం చేశేలా అడుగులు వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Pv sindhu, Sports, Tokyo Olympics