హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : హాకీలో తప్పని నిరాశ.. సెమీస్ లో పోరాడి ఓడిన అమ్మాయిలు.. ఇక, కాంస్యం కోసం పోరు..

Tokyo Olympics : హాకీలో తప్పని నిరాశ.. సెమీస్ లో పోరాడి ఓడిన అమ్మాయిలు.. ఇక, కాంస్యం కోసం పోరు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Tokyo Olympics : జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 13వ రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ఇప్పటిదాకా ఈ మెగా ఈవెంట్‌లో మహిళల హవా కొనసాగింది.

జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 13వ రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ఇప్పటిదాకా ఈ మెగా ఈవెంట్‌లో మహిళల హవా కొనసాగింది. భారత్‌ అందుకున్న మూడుకు మూడు మెడల్స్‌ను సాధించి పెట్టింది మగువలే. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను, బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గోహెయిన్‌ కాంస్యాన్ని అందుకున్నారు. అయితే, మహిళల హాకీలో మాత్రం భారత్ కు నిరాశ తప్పలేదు. రాణి రాంపాల్ సారథ్యంలోని భారత్ మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. 2-1 గోల్స్ తేడాతో భారత అమ్మాయిలు సెమీస్ లో ఓడిపోయారు. ఇక, కాంస్యం కోసం భారత అమ్మాయిలు పోరాడనున్నారు. ఓఐ హాకీ స్టేడియంలోని నార్త్ పిచ్ వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో తొలి 2 నిమిషాల్లోనే గుర్జీత్ కౌర్ భారత్ కు గోల్ అందించింది. దీంతో తొలి క్వార్టర్ భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, రెండో క్వార్టర్ లో అర్జెంటీనా తన ఖాతాను తెరిచి స్కోరును సమం చేసింది. అయితే, ఆ తర్వాత అర్జెంటీనా టీమ్ దూకుడును ప్రదర్శించింది. భారత అమ్మాయిలపై ఒత్తిడి పెంచి, ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మ్యాచ్ ను కైవసం చేసుకుని ఫైనల్ లోకి అడుగుపెట్టింది అర్జెంటీనా.

అయితే, రాణి రాంపాల్ టీమ్ గ్రూప్ దశలోనే వెనుదిరగాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల వేట నాసిరంగా ప్రారంభమైంది. పూల్‌-ఏలో మొదట్లో వరుస ఓటములను చవి చూసింది జట్టు. అయిదింట్లో మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది.ఈ దశలో భారత మహిళా హాకీ జట్టు కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు.. సెమీ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టిస్తుందని భావించనూ లేదు. అందరి అంచనాలను తలకిందులు చేసింది టీమ్. సమష్టిగా రాణించింది.. సత్తా చాటింది. మెరుపుల్లాంటి పాసింగ్స్‌తో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చి చరిత్ర సృష్టించింది.

ఇది కూడా చదవండి :  టీ-20 ప్రపంచకప్ లో దాయాదుల పోరుకు ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే..

ఇది కూడా చదవండి : వారెవ్వా రవి కుమార్ దహియా.. ఫైనల్ కు కుస్తీ వీరుడు.. భారత్ కు మరో పతకం ఖాయం..

గ్రూప్ దశలో అర్జెంటీనా జట్టును భారత్ ఎదుర్కొనలేదు. వేర్వేరు గ్రూపుల్లో ఉండటం వల్ల అది సాధ్య పడలేదు. ఫలితంగా- ఒకరి బలాలు, బలహీనతలు ఎలాంటివో తెలుసుకోవడానికి వీలు కలగలేదు. దీంతో, ఈ మ్యాచ్ లో పోరాడినా ఓటమి తప్పలేదు. ఇక, కాంస్య పోరులో గ్రేట్ బ్రిటన్ తో తలపడనున్నారు భారత అమ్మాయిలు.

First published:

Tags: Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు