టోక్యో ఒలింపిక్స్ లో భారత హకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. 41 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టిన మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని హాకీ ఇండియా.. ప్రత్యర్ధి గ్రేట్ బ్రిటన్ ను ఓడించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఓఐ హాకీ స్టేడియంలోని నార్త్ పిచ్ లో జరిగిన మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ పై 3-1 గోల్స్ తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2 గోల్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించిన మెన్ ఇన్ బ్లూ.. ఆస్ట్రేలియాపై 1-7 గోల్స్ తేడాతో ఎదుర్కొన్న అవమానకర ఓటమిని ఎదుర్కొంది. ఇక, అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకునే అవకాశమే రాలేదు భారత హాకీ ప్లేయర్లకు. వరుస విజయాలను అందుకుంటూ వచ్చారు. మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌ను వణికించిన హాకీ ఆటగాళ్లు.. అర్జెంటీనాపై తడాఖా చూపారు. 3-1 గోల్స్ తేడాతో మట్టి కరిపించారు. ఈ విజయంతో పూల్-ఏలో భారత్ తన రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గ్రూప్ దశలో మొత్తం అయిదు మ్యాచ్‌లల్లో నాలుగు విజయాలను సొంతం చేసుకుంది టీమిండియా.
WE'RE THROUGH TO THE SEMIS!!! #TeamIndia will take on Belgium in the semi-final!!!
A perfect quarterfinal victory at #Tokyo2020 #Cheer4India pic.twitter.com/Ru23RMdseC
— SAIMedia (@Media_SAI) August 1, 2021
హాకీలో ఎంతో ఘన చరిత్ర ఉన్న భారత్ గత కొద్ది ఏళ్లుగా సత్తా చాటలేకపోతోంది. కానీ, మన్ ప్రీత్ సారధ్యంలో యంగ్ కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే భారత్ కు మరో పతకం ఖాయం. ఇక, సెమీఫైనల్ లో టీమిండియా బెల్జియంతో తలపడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Team India, Tokyo Olympics