హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ లో నిరాశపర్చిన తెలుగు తేజం..తొలి రౌండ్ లోనే ఇంటి బాట..

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ లో నిరాశపర్చిన తెలుగు తేజం..తొలి రౌండ్ లోనే ఇంటి బాట..

Photo Credit : AFP

Photo Credit : AFP

Tokyo Olympics : ఓ వైపు టోక్యో ఒలింపిక్స్ లో భారత బోణి కొట్టినందుకు సంతోషపడాలో..మరోవైపు.. పతకాలు సాధిస్తారు అనుకున్న అథ్లెట్లు నిరాశపరుస్తుంటే బాధపడాలో అస్సలు అర్ధం కావడం లేదు.

ఓ వైపు టోక్యో ఒలింపిక్స్ లో భారత బోణి కొట్టినందుకు సంతోషపడాలో..మరోవైపు.. పతకాలు సాధిస్తారు అనుకున్న అథ్లెట్లు నిరాశపరుస్తుంటే బాధపడాల్లో అస్సలు అర్ధం కావడం లేదు. పతకాలు సాధిస్తారనుకున్న భారత అథ్లెట్లు ఒక్కొక్కరుగా నిరాశకు గురి చేస్తూ వస్తోన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మరో పరాయజం భారత్‌ను పలకరించకుండా ఉండలేకపోయింది. భారత్ పతకం సాధించి తీరుతుందనుకున్న బ్యాడ్మింటన్ కేటగిరీలో పరాజయం నమోదైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకం సాధిస్తుందనుకునే కేటగిరీలో టాప్‌లో ఉండే ఈవెంట్.. బ్యాడ్మింటన్. ఇందులోనే తొలి పరాజయం ఎదురైంది. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం భమిడిపాటి సాయి ప్రణీత్.. తన తొలి మ్యాచ్‌‌లో ఓడిపోయాడు. ఇజ్రాయెల్ ఆటగాడు మిషా జిల్బర్‌మ్యాన్ చేతిలో అతనికి చుక్కెదురైంది. వరుస సెట్లను ప్రత్యర్థికి కోల్పోయాడు సాయి ప్రణీత్. ఏ సెట్‌లో కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. తొలి సెట్‌ను 17-21, రెండో సెట్‌ను 15-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. 42 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. మిషా జిల్బర్‌మ్యాన్ కొత్తోడేమీ కాదు. ఇదివరకు సాయిప్రణీత్‌ ఓ సారి అతనితో తలపడ్డాడు.. విజయం సాధించాడు. మిషా బలాలు, బలహీనతలేమిటో అతినికి తెలుసు. విస్ ఓపెన్‌లో సాయి ప్రణీత్, మిషా హోరాహోరీగా పోరాడారు. ఆ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ గెలిచాడు. దానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయింది మిషా. ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్‌లో సాయి ప్రణీత్ దండయాత్రకు అడ్డుగా నిలిచాడు. సైంధవుడిలా అడ్డుపడ్డాడు.

ఇక, ఒలింపిక్స్‌లో మిషా అగ్రెసివ్‌గా ఆడాడు. తన ప్రత్యర్థిని కోలుకోనివ్వకుండా చేశాడు. మిషా జిల్బర్‌మ్యాన్ డ్రాప్ షాట్లను సాయి ప్రణీత్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. మిషా కొన్ని పొరపాట్లను చేసినప్పటికీ.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సాయి ప్రణీత్ విఫలం అయ్యాడు. ఒక దశలో మిషా రెట్టింపు పాయింట్లను సాధించాడు. సాయి ప్రణీత్ ఏడు పాయింట్ల వద్ద నిలిచిపోగా.. అతని దూకుడు 11 వరకూ కొనసాగింది. అదే తేడా మ్యాచ్ చివరి వరకూ కంటిన్యూ అయింది. మిషాను అధిగమించడానికి సాయి ప్రణీత్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

సాయి ప్రణీత్‌కు ఇదే తొలి ఒలింపిక్స్. ఏస్ షట్లర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో మిషా జిల్బర్‌మ్యాన్ ర్యాంక్ 47 మాత్రమే. తన కంటే చాలా తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాడిని ఓడించలేకపోయాడు సాయి ప్రణీత్. ఇక, బ్యాడ్మింటన్ లో ఆశల్నీ మరో తెలుగు తేజం పీవీ సింధుపైనే ఆధారపడ్డాయ్.

First published:

Tags: Badminton, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు