హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : శభాష్ సింధు.. భారత్ కు మరో పతకాన్ని అందించిన తెలుగు తేజం..

Tokyo Olympics : శభాష్ సింధు.. భారత్ కు మరో పతకాన్ని అందించిన తెలుగు తేజం..

PV Sindhu  (Twitter)

PV Sindhu (Twitter)

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ భారత మహిళా అథ్లెట్ల దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే మీరా భాయ్ చాను, లవ్లీనా భారత్ కు పతకాలు ఖాయం చేయగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో తెలుగు తేజం పీవీ సింధు చేరింది.

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ భారత మహిళా అథ్లెట్ల దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే మీరా భాయ్ చాను, లవ్లీనా భారత్ కు పతకాలు ఖాయం చేయగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో తెలుగు తేజం పీవీ సింధు చేరింది. క్యాంసం కోసం జరిగిన ఫైట్ లో సింధు చైనా ప్రత్యర్థి హె బింగ్‌జియావోను మట్టికరిపించింది. వరుస సెట్లలో విజయం సాధించింది. మరో వైపు, ఈ మ్యాచ్ లో నెగ్గి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఫస్ట్ సెట్ 21-13 తో నెగ్గింది. ఫస్ట్ లో ఆధిక్యంలోకి దూసుకొచ్చిన సింధుకి ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. అయినా, మొక్కవోనీ దీక్షతో పోరాడి ఫస్ట్ సెట్ ను కైవసం చేసుకుంది. అయితే, రెండో సెట్ లో సింధు ప్రతి పాయింట్ కోసం పోరాడాల్సి వచ్చింది. చైనా ప్లేయర్ హె జింగ్ జియావో వరుస ర్యాలీలతో సింధుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే, సింధు తన దూకుడైన ఆటతో ప్రత్యర్థి ఆట కట్టించింది. రెండో సెట్ ను 21-15   తేడాతో నెగ్గి మ్యాచ్ ను కైవసం చేసుకుంది తెలుగు తేజం.

ఇక, వరుస ఒలింపిక్స్‌లల్లో పతకాలను సాధించిన తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. 2016లో బ్రెజిల్ రాజధాని రియో డీ జనేరియోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె రజతాన్ని గెలచుకున్నారు. ఇప్పటిదాకా ఈ ఘనతను సాధించిన భారత్ అథ్లెట్ సుశీల్ కుమార్ ఒక్కడే. వరుస ఒలింపిక్స్‌లో అతను రజతం, కాంస్య పతకాలను సాధించాడు.

షార్ప్‌ కట్స్‌.. అక్యూరసీ షాట్స్‌.. బుల్లెట్‌లా దూసుకెళ్లే స్మాష్‌లు.. ఎదురులేని స్ట్రోక్‌లు.. ఇలా షటిల్‌పై సంపూర్ణ నియంత్రణ. మొత్తంగా ఆల్‌రౌండ్‌ విన్యాసం సింధూది. అదే ఇప్పుడు.. సింధూకి కలిసొచ్చింది. కోట్లాది మంది ఆశల్ని నిజం చేసింది తెలుగు తేజం. ఇక అంతకు ముందు, ఊహించని విధంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది. బంగారు పతకాన్ని ముద్దాడే బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయింది. చివరికి కాంస్య పతక పోరులో గెలిచి చరిత్ర సృష్టించింది.

First published:

Tags: Pv sindhu, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు