హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : భారత్ కు భారీ షాక్.. సెమీస్ లో ఓడిన పీవీ సింధు.. అయినా, పతకం నెగ్గే ఛాన్స్ ..

Tokyo Olympics : భారత్ కు భారీ షాక్.. సెమీస్ లో ఓడిన పీవీ సింధు.. అయినా, పతకం నెగ్గే ఛాన్స్ ..

పీవీ సింధు

పీవీ సింధు

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు భారీ షాక్ తగిలింది. కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యాయ్. బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్ లో తెలుగు తేజం పీవీ సింధు వరల్డ్ నెం.1 ప్లేయర్ తై జూ యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు భారీ షాక్ తగిలింది. కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యాయ్. బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్ లో తెలుగు తేజం పీవీ సింధు వరల్డ్ నెం.1 ప్లేయర్ తై జూ యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. దీంతో ఫైనల్ లోకి ఎంట్రీ ఇవ్వకుండానే నిష్క్రమించింది సింధు. వరల్డ్ నెం.1 ప్లేయర్ తై జూ యింగ్ తన అనుభవన్నంతా ఉపయోగించి.. ఈ మ్యాచ్ ను సొంతం చేసుకుంది. వరుసగా రెండు సెట్లలో ఓడిపోయింది సింధు. ఫస్ట్ సెట్ ను 21-18 తేడాతో నెగ్గింది తై జూ. ఇక, రెండో సెట్ ను  21 - 12 తేడాతో నెగ్గింది తైజూ. అయినా, సింధుకు కాంస్య పతకం నెగ్గే ఛాన్స్ ఉంది. కాంస్య పతక పోరులో సింధు తలపడి.. ఆ మెడల్ ను భారత్ ఖాతాలో వేసే ఛాన్సుంది. ఇక, కాంస్య పతక పోరులో చైనా ప్లేయర్ హి బింగ్ జెయివో తో తలపడనుంది సింధు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం ఐదు గంటలకు జరగనుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు రజతం గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆరంభం నుంచే ఇద్దరు ప్రతి పాయింట్ కోసం పోరాడారు. సుదీర్ఘమైన ర్యాలీలు జరిగాయ్. ఫస్ట్ సెట్ లో మొదట్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు.. అనవసరపు తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది.

క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది. 21 -13, 22-20 తేడాతో విజయకేతనం ఎగురవేసింది. మొదటి సెట్ లో అలవోకగా నెగ్గిన సింధు.. రెండో సెట్ లో ప్రత్యర్థి నుంచి సవాల్ ఎదురైంది. ఇద్దరూ ప్లేయర్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. సుదీర్ఘమైన ర్యాలీలు ఆడారు. రెండో సెట్ లో గేమ్ పాయింట్ కాచుకుని మ్యాచ్ గెలిచింది పీవీ సింధు. అయితే, కీలక పోరు సెమీస్ లో ఓడిపోవడంతో భారత్ కు తీవ్ర నిరాశ ఎదురైంది.

First published:

Tags: Badminton, Pv sindhu, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు