హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : ఒలింపిక్స్ లో పీవీ సింధు దూకుడు.. సెమీస్ కు దూసుకెళ్లిన తెలుగు తేజం ..

Tokyo Olympics : ఒలింపిక్స్ లో పీవీ సింధు దూకుడు.. సెమీస్ కు దూసుకెళ్లిన తెలుగు తేజం ..

పీవీ సింధు

పీవీ సింధు

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు దూకుడు కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే టార్గెట్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది.

ఇంకా చదవండి ...

టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు దూకుడు కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే టార్గెట్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది. 21 -13, 22-20 తేడాతో విజయకేతనం ఎగురవేసింది. మొదటి సెట్ లో అలవోకగా నెగ్గిన సింధు.. రెండో సెట్ లో ప్రత్యర్థి నుంచి సవాల్ ఎదురైంది. ఇద్దరూ ప్లేయర్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. సుదీర్ఘమైన ర్యాలీలు ఆడారు. రెండో సెట్ లో గేమ్ పాయింట్ కాచుకుని మ్యాచ్ గెలిచింది పీవీ సింధు. 56 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సింధు నెగ్గింది. గతంలో వీరిద్దరూ 18 సార్లు పోటీపడగా 11-7తో సింధుదే పైచేయి.

షార్ప్‌ కట్స్‌.. అక్యూరసీ షాట్స్‌.. బుల్లెట్‌లా దూసుకెళ్లే స్మాష్‌లు.. ఎదురులేని స్ట్రోక్‌లు.. ఇలా షటిల్‌పై సంపూర్ణ నియంత్రణ. మొత్తంగా ఆల్‌రౌండ్‌ విన్యాసం సింధూది. అదే ఇప్పుడు.. సింధూకి కలిసొచ్చింది. స్వర్ణ ఆశలు మోస్తున్న ఆ దిశగా అడుగులేస్తోంది. పీవీ సింధు ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే భారత్ కు గోల్డ్ పతకం గ్యారెంటీ. ఫస్ట్ సెట్ నుంచే దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థి ఒత్తిడి పెంచింది. తనదైన స్మాష్ షాట్లు, డ్రాప్ షాట్లతో ప్రత్యర్ధిపై ఆది నుంచే దూకుడు కొనసాగించింది. ఫస్ట్ సెట్ ను 21-13 తో కైవసం చేసుకున్న సింధు.. అదే జోరు రెండో సెట్ లోనూ కొనసాగించింది.

యమగుచి వెన్ను గాయం తర్వాత మునుపటి వేగం తన ఆటలో లోపించిందని స్వయంగా ఆమే ప్రకటించింది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో తీవ్రమైన ఒత్తిడి యమగుచిలో కన్పించింది. ఇక, సెమీస్ మ్యాచ్ రేపు జరగనుంది. సింధు ప్రత్యర్థి ఇంకా ఎవరో తేలలేదు. రేపు ఈ సెమీస్ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభంకానుంది.

First published:

Tags: Badminton, Pv sindhu, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు