హోమ్ /వార్తలు /క్రీడలు /

PV Sindhu : " నా కోసం మెడల్ గెలవమన్నాను ".. సింధు విక్టరీపై ఆమె తండ్రి రియాక్షన్ ..

PV Sindhu : " నా కోసం మెడల్ గెలవమన్నాను ".. సింధు విక్టరీపై ఆమె తండ్రి రియాక్షన్ ..

PV Sindhu : " నా కోసం మెడల్ గెలవమన్నాను "..  సింధు విక్టరీపై ఆమె తండ్రి రియాక్షన్ ..

PV Sindhu : " నా కోసం మెడల్ గెలవమన్నాను ".. సింధు విక్టరీపై ఆమె తండ్రి రియాక్షన్ ..

PV Sindhu : మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరు పీవీ సింధు విజయం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విజృంచి ఆడిన సింధు.. కాంస్య పతకంతో మెరిసింది.

ఇంకా చదవండి ...

టోక్యో ఒలింపిక్స్ భారత మహిళా అథ్లెట్ల దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే మీరా భాయ్ చాను, లవ్లీనా భారత్ కు పతకాలు ఖాయం చేయగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో తెలుగు తేజం పీవీ సింధు చేరింది. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుని భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది సింధు. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరు పీవీ సింధు విజయం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విజృంచి ఆడిన సింధు.. కాంస్య పతకంతో మెరిసింది. సింధు విక్టరీపై ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు. కాంస్యం సాధించడం ద్వారా పీవీ సింధు దేశానికి పేరు తీసుకొచ్చిందన్నారు ఆమె తండ్రి పీవీ రమణ. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం జరిగిన పోరులో పీవీ సింధే విజయం సాధించడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన.. నిన్నటి ఓటమితో కృంగిపోకుండా వెంటనే ఫామ్‌లోకి రావడం అద్భుతమని రమణ అన్నారు. ఫోకస్‌గా బాడీ లాంగ్వేజ్‌తో పోరాడాలని తాను చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

నిన్నటి మ్యాచ్‌లో ఓటమిపై సింధూ, ఆమె కోచ్ విశ్లేషణ చేసుకున్నారని రమణ తెలిపారు. ఎక్కడా తగ్గకుండా అటాకింగ్ చేయాల్సిందిగా తాను చెప్పానని.. సింధూ ఇవాళ చాలా పాజిటివ్‌గా ఆడిందని ఆయన వెల్లడించారు. చాలా దూకుడుగా అటాకింగ్ గేమ్ ఆడిందని రమణ వెల్లడించారు. ఎల్లుండి తాను ఢిల్లీకి వెళ్లి సింధుకి స్వాగతం పలుకుతానని ఆయన చెప్పారు. సింధు తనదైన శైలిలో ఆడేందుకు కోచ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని రమణ పేర్కొన్నారు. మెడల్ తీసుకొచ్చింది కాబట్టే ప్రధానితో కలిసి ఐస్ క్రీమ్‌ తింటుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. న్యూస్ 18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాల్ని తెలిపారు.

ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఎట్టకేలకు రెండో పతకం దక్కింది. ఈ మ్యాచ్ గెలిచిన సింధు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా ఒలింపిక్స్ లో పతకాలను సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్ గా రికార్డు క్రియేట్ చేసింది సింధు. 2016లో బ్రెజిల్ రాజధాని రియో డీ జనేరియోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె రజతాన్ని గెలచుకుంది. ఇప్పుడు, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా ఈ ఘనతను సాధించిన భారత్ అథ్లెట్ సుశీల్ కుమార్ ఒక్కడే. వరుస ఒలింపిక్స్‌లో అతను రజతం, కాంస్య పతకాలను సాధించాడు.

First published:

Tags: Badminton, Pv sindhu, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు