టోక్యో ఒలింపిక్స్ భారత మహిళా అథ్లెట్ల దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే మీరా భాయ్ చాను, లవ్లీనా భారత్ కు పతకాలు ఖాయం చేయగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో తెలుగు తేజం పీవీ సింధు చేరింది. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుని భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది సింధు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరు పీవీ సింధు విజయం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విజృంచి ఆడిన సింధు.. కాంస్య పతకంతో మెరిసింది. ఇక, టోక్యో ఒలింపిక్స్ సక్సెస్ తర్వాత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుతో కలిసి ఐస్క్రీమ్ తింటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సింధు సక్సెస్ అయింది కాబట్టి.. ఇక, ప్రధాని మోదీతో ఐస్ క్రీమ్ తినడమే మిగిలింది. అసలు కథ ఏంటంటే.. ఒలింపిక్స్ కు ముందు..మోదీతో జరిగిన వర్చువల్ సమావేశంలో సింధు.. తన ఆకాంక్షను తెలిపింది. " 2016లోనూ ఐస్ క్రీమ్ తినకుండా ప్రాక్టీస్ చేసి సిల్వర్ మెడల్ దక్కించుకున్నాను. మరికొద్దిరోజుల్లో జరగనున్న ఒలింపిక్స్ కోసం డైట్ కంట్రోల్ తప్పనిసరి. ఎక్కువ మొత్తంలో ఐస్ క్రీమ్ తినడానికి వీలుండటం లేదు" అని అంది.
‘హార్డ్ వర్క్ చేయ్.. నీ మీద నమ్మకం ఉంది. ఈ సారి కూడా సక్సెస్ఫుల్ అవుతావు. సక్సెస్ తర్వాత మీ అందరినీ కలుస్తా. ఐస్క్రీమ్ తిందాం’ అని మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు సింధు కాంస్య పతకం గెలిచింది. దీంతో మోదీ, సింధు భారత్ కు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తనతో కలిసి తింటారో లేదో వేచి చూడాలి.
Being an athlete requires a rigorous schedule and hardwork. I asked @Pvsindhu1 about her love for ice-cream and also interacted with her parents. pic.twitter.com/Hlapc8VJhp
— Narendra Modi (@narendramodi) July 13, 2021
ఇక, టోక్యో ఒలింపిక్స్లో భారత్కి ఎట్టకేలకు రెండో పతకం దక్కింది. ఈ మ్యాచ్ గెలిచిన సింధు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా ఒలింపిక్స్ లో పతకాలను సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్ గా రికార్డు క్రియేట్ చేసింది సింధు. 2016లో బ్రెజిల్ రాజధాని రియో డీ జనేరియోలో జరిగిన ఒలింపిక్స్లో ఆమె రజతాన్ని గెలచుకుంది. ఇప్పుడు, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా ఈ ఘనతను సాధించిన భారత్ అథ్లెట్ సుశీల్ కుమార్ ఒక్కడే. వరుస ఒలింపిక్స్లో అతను రజతం, కాంస్య పతకాలను సాధించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PM Narendra Modi, Pv sindhu, Sports, Tokyo Olympics