మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరు పీవీ సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విజృంచి ఆడిన సింధు.. కాంస్య పతకంతో మెరిసింది. అయితే, ఈ విక్టరీపై స్పందించింది సిందు. ఇన్నేళ్లుగా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం పీవీ సింధు తెలిపింది. తనను చాలా ఎమోషన్స్ వెంటాడుతున్నాయంది. కాంస్య పతకం గెలిచినందుకు సంతోషించాలో.. ఫైనల్లో ఆడే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదని సింధు బాధపడింది.
మ్యాచ్ తర్వాత పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ... " ఇన్నేళ్లుగా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నన్నుచాలా ఎమోషన్స్ వెంటాడుతున్నాయి. కాంస్య పతకం గెలిచినందుకు సంతోషించాలో.. లేదా ఫైనల్లో ఆడే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఈ మ్యాచ్ ఆడే సమయంలో నా భావోద్వేగాలు అన్నింటినీ పక్కనపెట్టి.. శాయశక్తులా ఆడాను. ఇప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి మెడల్ సాధించిపెట్టినందుకు గర్వపడుతున్నా" అని తెలిపింది.
#PVSindhu talks to media in #Hyderabad, over a video call, after her #Bronze win- ‘Lot of emotions. Very happy, super proud. Happy because I got another chance, sad because I lost an opportunity…’ she says. Her coach #parktaesang also joins the quick call. #Tokyo2020 pic.twitter.com/p5KJxNKxtm
— Rishika Sadam (@RishikaSadam) August 1, 2021
"శనివారం జరిగిన మ్యాచ్లో మేమిద్దరం ( పీవీ సింధు, హి బింగ్జియావో) ఇద్దరం ఓడిపోయాం. మా ఇద్దరికీ ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. దేశం కోసం మెడల్ గెలవాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఇలాంటి సమయంలో పోరాడటం అంత సులువు కాదు. చాలా పెద్ద విషయం. ఈ మ్యాచ్లో గెలవడం కోసం చాలా ఓపిగ్గా ఉన్నా. ఆధిక్యంలో ఉన్నప్పటికీ విశ్రమించలేదు. రియో కంటే చాలా కష్టపడాల్సి వచ్చింది" అని తెలుగు తేజం సింధు చెప్పుకొచ్చింది.
"2024 పారిస్ ఒలింపిక్స్లో కచ్చితంగా బంగారం గెలుచుకునేలా కష్టపడతాను" అని పీవీ సింధు పేర్కొంది. తన గెలుపు కోసం కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడ్డారని పేర్కొంది. అలాగే స్పాన్సర్స్ కూడా ఎంతగానో ప్రోత్సహించారని ఆమె చెప్పింది. ఈ సందర్భంగా వారందరికీ సింధు కృతజ్ఞతలు తెలిపింది.వరుసగా ఒలింపిక్స్ లో పతకాలను సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్ గా రికార్డు క్రియేట్ చేసింది సింధు. 2016లో బ్రెజిల్ రాజధాని రియో డీ జనేరియోలో జరిగిన ఒలింపిక్స్లో ఆమె రజతాన్ని గెలుచుకుంది. ఇప్పుడు, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా ఈ ఘనతను సాధించిన భారత్ అథ్లెట్ సుశీల్ కుమార్ ఒక్కడే. వరుస ఒలింపిక్స్లో అతను రజతం, కాంస్య పతకాలను సాధించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, Pv sindhu, Sports, Tokyo Olympics