హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : కొత్త చిరుత వచ్చేసింది.. 100 మీటర్ల పరుగు పందెంలో నయా ఛాంపియన్..

Tokyo Olympics : కొత్త చిరుత వచ్చేసింది.. 100 మీటర్ల పరుగు పందెంలో నయా ఛాంపియన్..

Photo Credit : AFP

Photo Credit : AFP

Tokyo Olympics : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కొత్త చిరుత వచ్చేసింది. ఈ ఏడాది ఒలింపిక్స్ లో సంచలనం నమోదైంది. ప్రపంచంమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 100 మీటర్ల పరుగు పందెంలో..

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కొత్త చిరుత వచ్చేసింది. ఈ ఏడాది ఒలింపిక్స్ లో సంచలనం నమోదైంది. ప్రపంచంమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 100 మీటర్ల పరుగు పందెంలో ఇటలీకి చెందిన అథ్లెట్‌ లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. కేవలం 9.80 సెకన్లలో అతడు గమ్యాన్ని చేరుకున్నాడు. ఇకఅమెరికాకు చెందిన అథ్లెట్‌ ఫ్రెడ్‌ కెర్లీ (9.84 సెకన్లు) రజతం, కెనడాకు చెందిన అథ్లెట్‌ ఆండ్రీ డి గ్రాస్సే (9.89 సెకన్లు) కాంస్యం దక్కించుకున్నారు. మొత్తానికి జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌ లేకుండా జ‌రిగిన ఈ రేసులో ఎవరి ఊహకూ అందని రీతిలో కొత్త చాంపియ‌న్ అవ‌త‌రించాడు. గ‌త మూడు ఒలింపిక్స్‌లో 100 మీట‌ర్ల రేసు అంటే ఉసేన్ బోల్ట్‌దే గోల్డ్ మెడ‌ల్ అని ఫిక్స‌యిపోయి చూసేవారు. కానీ ఈసారి అత‌డు లేకుండా జ‌రిగిన ఈ రేసులో ఓ కొత్త చాంపియ‌న్ అవ‌త‌రించాడు. లామంట్ మార్సెల్ జాకబ్స్ 9.8 సెక‌న్ల‌లో రేసు పూర్తి చేసి ఒలింపిక్ చాంపియ‌న్‌గా నిలిచాడు. 100 మీట‌ర్ల రేసులో పాల్గొన్న అథ్లెట్ల‌ను ఒలింపిక్స్‌ నిర్వాహ‌కులు అథ్లెటిక్ స్టేడియంలో వినూత్నంగా చూపించారు. లైట్ల‌న్నీ ఆఫ్ చేసి 12 ప్రొజెక్ట‌ర్ల‌తో ఈ అథ్లెట్ల 3డీ ఇమేజ్‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు.

మార్సెల్‌ జాకబ్స్‌ 1994 సెప్టెంబరు 24 అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించాడు. జాకబ్స్‌ తల్లి వివియానా ఇటలీకి చెందిన వారు. తండ్రి అమెరికన్‌. జాకబ్స్‌ తండ్రి యూఎస్‌ ఆర్మీలో పనిచేసేవారు. వృత్తి రిత్యా ఆయన సౌత్‌ కొరియాకు వెళ్లిపోయారు. దీంతో జాకబ్స్‌ను తీసుకుని ఆమె తల్లి వివియానా ఇటలీకి వచ్చేసింది. మార్సెల్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలాచాలా ఇష్టం. అతను అథ్లెట్‌ కాకముందు పలు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. స్విమ్మింగ్‌, బాస్కెట్‌ బాల్‌ కూడా ఆడేవాడు.

2018లో అనూహ్యంగా 100 మీటర్ల ట్రాక్‌పైకి వచ్చిన మార్సెల్‌ జాకబ్‌ సాధన చేయడం మొదలు పెట్టాడు. ఈలోగా కరోనా రావడంతో ఇంటి వద్దే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. మళ్లీ 2021లో సాధన మొదలు పెట్టిన జాకబ్స్‌.. యూరోపియన్‌ ఇండోర్‌ ఛాంపియన్స్‌లో 60 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత సవోనాలో 100 మీటర్లను 9.95 సెకన్లలో చేరుకుని సరికొత్త ఇటాలియన్‌ రికార్డు నమోదు చేశాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌ 2020లో గోల్డ్ గెలిచి రికార్డు సృష్టించాడు. ఇక నెట్టింట బోల్డ్ వారసుడొచ్చడంటూ కామెంట్లు వస్తున్నాయ్.

First published:

Tags: Italy, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు