టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరోసారి నిరాశ ఎదురైంది. భారత గోల్ఫ్ క్రీడాకారిని అదితి అశోక్ అనూహ్య రీతిలో పతకం మిస్ అయింది. ఓవరాల్ గా నాలుగో స్థానంలో నిలిచి.. పతకాన్ని జస్ట్ మిస్ అయింది అదితి అశోక్. గోల్ప్ మహిళా విభాగం తుది పోరులోని నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా సాగింది.. చివరి కంటూ పోరాడిన భారత గోల్ఫర్ అదితి అశోక్ చివరికి నాలుగో ప్లేస్ తో సరిపెట్టుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో అదితి అశోక్ కొంచెం ఇబ్బందులు ఎదుర్కోంది. అయినా..200 వ ర్యాంకులో ఉన్న అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలవడం ఆషామాషీ కాదు. వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా కి బంగారు పతకం దక్కింది. మోనో ఇనామీ, లియాడో కో రజత, కాంస్య పతకాలు కోసం పోటీపడుతున్నారు. గత మూడు రోజులుగా నిలకడగా రాణించినా అదితికి.. ఇనామీ, లియాడో కో నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా అదితి చరిత్ర సృష్టించింది. ఓ భారత గోల్ఫర్ ఇలా ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలవడం ఇదే తొలిసారి.
ఇక అదితి అశోక్ 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. తద్వారా ఒలింపిక్స్ బరిలో దిగిన అతి పిన్న గోల్ఫర్గా రికార్డుకెక్కింది. అదితి అశోక్‌ది గోల్ఫ్ బ్యాక్ రౌండ్ నుంచి రాలేదు. ఓ రెస్టారెంట్ విండో నుంచి 5 ఏళ్ల వయసులో తొలిసారి ఈ ఆటను చూసింది. ఆమెకు ఈ ఆట నచ్చడంతో తన తండ్రి ప్రోత్సహించారు.
India’s ?? 1st woman golfer
to finish 4th at Olympics Games!
Aditi Ashok, deserves a standing ovation for her exemplary performance at #Tokyo2020.
You played consistently well, had us holding our breath till the end @aditigolf !
You created history, best wishes ahead. pic.twitter.com/ZirJgzcgFw
— Anurag Thakur (@ianuragthakur) August 7, 2021
ఏషియన్ యూత్ గేమ్స్(2013), యూత్ ఒలింప్ గేమ్స్(2014), ఏషియన్ గేమ్స్(2014), 2016 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత తొలి మహిళ గోల్ఫర్ అదితినే కావడం విశేషం. లాలా ఐచా టూర్ స్కూల్ టైటిల్ గెలిచిన అతి చిన్న భారత్ గోల్ఫర్ కూడా అదితినే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tokyo Olympics