టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics 2020) ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రపంచ దేశాల క్రీడాకారులంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ క్రీడల్లో గెలవాలని ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కోరుకుంటారు. ఇందులో పాల్గొనేందుకు కూడా చాలా గట్టి పోటీని ఎదుర్కొని అక్కడి వరకు చేరుకుంటారు. అక్కడ కూడా ఎన్నో దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులను గెలిచి పతకాన్ని సాధిస్తారు. ఈ పోటీలను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన క్రీడా ప్రేమికులు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా క్రీడల గురించే చర్చ జరుగుతోంది.
అయితే కేవలం క్రీడల గురించే కాదు.. క్రీడాకారులు, క్రీడాకారిణుల గురించి కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అన్ని దేశాలకు చెందిన ట్విట్టర్ యూజర్లు ఒలింపిక్స్ క్రీడల్లో ఒక క్రీడాకారిణికి ఫ్యాన్స్ అయిపోయారు. తమ దేశానికి చెందిన వారితో పాటు ఆమె కూడా గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఎవరో కాదు.. బ్రెజిల్ కి చెందిన స్కేట్ బోర్డింగ్ క్రీడాకారిణి లతీషియా బఫోనీ. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఆమె గురించే చర్చ నడుస్తోంది. ఎంతో మంది ఆమె అంటే పిచ్చెక్కిపోయేలా ప్రేమిస్తున్నారు.
అథ్లెట్లకు చెందిన అధికారిక సమాచారం ప్రకారం లతీషియా వయసు 28 సంవత్సరాలు. ఆమె ఆరు సార్లు X గేమ్స్ లో బంగారు పతకం సాధించింది. అంతే కాదు.. ఎస్ ఎల్ ఎస్ సూపర్ క్రౌన్ ఛాంపియన్ షిప్ విజేత కూడా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభా వంతులైన స్కేట్ బోర్డర్లలో ఆమె ఒకరు. అయితే లతీషియా అందం అందరినీ ఆకర్షించిందేమో.. అందుకే అందరూ ఆమెను ఇష్టపడుతున్నారేమో అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అందంతో పాటు లతీషియా టాలెంట్, దృఢ సంకల్పం, తన ప్రవర్తన అన్నీ ముందు మీడియా కళ్లు ఆమె పైకి చేరేలా చేశాయి. ఆ తర్వాత ఎన్నో దేశాలకు చెందిన కోట్లాది మంది ఆమెకు ఫ్యాన్స్ అయ్యేలా చేశాయి. వివిధ దేశాల వారు తమ సొంత దేశపు అథ్లెట్లను కూడా కాదని ఆమెకు సపోర్ట్ అందించేందుకు కూడా ఇదే కారణం అని చెప్పుకోవచ్చు.
అందుకే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అబ్బాయిలంతా ఆమెకు ట్విట్టర్ వేదికగా ప్రేమ లేఖలు రాస్తున్నారు. "నేను అమెరికా స్కేట్ బోర్డింగ్ టీమ్ కి మద్దతును అందించేవాడిని. లతీషియా బఫోని ని చూసి నా మనసు మార్చుకున్నాను. ఆమెకు సపోర్ట్ చేస్తున్నా" అని ఒక వ్యక్తి ట్వీట్ చేస్తే.. మరో వ్యక్తి "ఈ పోటీలను కేవలం లతీషియా బఫోని కోసమే చూస్తున్నా" అంటూ సమాధానం ఇచ్చారు. "నేను తనని ప్రేమిస్తున్నా" అంటూ ఎంతో మంది ట్వీట్ చేస్తున్నారు. మరికొందరు ఆమెతో డేట్ కి వెళ్లాలని ఉందని ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics, Twitter