హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: కొరియన్ ఆర్చరీ టీమ్ గెలుపుకు కారణం ఆ ప్రముఖ కార్ల కంపెనీ.. టెక్నాలజీ సాయంతో..

Tokyo Olympics: కొరియన్ ఆర్చరీ టీమ్ గెలుపుకు కారణం ఆ ప్రముఖ కార్ల కంపెనీ.. టెక్నాలజీ సాయంతో..

Photo Credit : Reuters

Photo Credit : Reuters

Tokyo Olympics: కొరియన్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చుంగ్ యూ-సన్ సారథ్యంలో ఆటగాళ్ల బృందం కోసం.. హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్ ఓ టెక్నికల్ సపోర్ట్ ప్రాజెక్టును ప్రారంభించిందట. ఈ ప్రాజెక్టు సాయంతోనే ఒలింపిక్స్‌లో ఆర్చరీ పోటీల్లో కొరియన్ క్రీడాకారులు గెలిచారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల కోసం ప్రపంచ దేశాల మేటి ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఇటీవల విశ్వ క్రీడల్లో నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో కొరియన్ ఆర్చరీ టీమ్ 3 బంగారు పతకాలను సాధించింది. దీంతో కొరియన్ టీమ్‌ని బాగా సపోర్ట్ చేసిన హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్ పై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొరియన్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చుంగ్ యూ-సన్ సారథ్యంలో ఆటగాళ్ల బృందం కోసం.. హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్ ఓ టెక్నికల్ సపోర్ట్ ప్రాజెక్టును ప్రారంభించిందట. ఈ ప్రాజెక్టు సాయంతోనే ఒలింపిక్స్‌లో ఆర్చరీ పోటీల్లో కొరియన్ క్రీడాకారులు గెలిచారని తెలుస్తోంది. 2016 రియో ఒలింపిక్స్ నుంచి కొరియన్ టీమ్ టెక్నికల్ సపోర్టుపై ఆధారపడుతోంది. క్రీడాకారుల అభిప్రాయాల ప్రకారం హ్యుందాయ్‌ సంస్థ 5 రంగాలకు సంబంధించిన టెక్నాలజీని రూపొందించింది. అవేంటంటే..

1. హైప్రెసిషన్ షూటింగ్ మెషిన్:

ఆర్చరీ పోటీల్లో గెలవాలంటే మంచి విల్లు ముఖ్యం. కానీ అలాంటి అత్యుత్తమ విల్లును ఎంపిక చేసుకోవడం కష్టం. అయితే హ్యుందాయ్‌ డెవలప్ చేసిన హైప్రెసిషన్ షూటింగ్ మెషిన్ తో ఉత్తమ విల్లును ఎంచుకోవచ్చు. క్రీడాకారులు విల్లును షూటింగ్ మిషన్ లో పెట్టి 70 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని బాణంతో ఎక్కు పెట్టాలి. బాణం టార్గెట్ ని హిట్ చేస్తే.. అది మంచి విల్లు అని అర్థం చేసుకోవాలి. అదే టార్గెట్ ని హిట్ చేయకపోతే ఆ విల్లులో డిఫెక్ట్ ఉందని గ్రహించాలి.

2. ఆటోమేటిక్ స్కోర్ రికార్డర్:

టార్గెట్ బోర్డుపై 10, 9, 8 వంటి స్కోర్ లు ఉంటాయి కదా.. ఆ స్కోర్స్ పై కరెక్ట్ గా బాణం విసరడానికి టెలిస్కోపు ద్వారా క్రీడాకారులు చూస్తారు. క్రీడాకారుడు షూట్ చేసే బాణం ఏ స్కోర్ ని హిట్ చేస్తుందనేది ఎవరికీ తెలియదు. కానీ ఆటోమేటిక్ స్కోర్ రికార్డర్ తో బాణం విసరకుండానే టెలిస్కోప్ ద్వారా చూడకుండానే.. స్కోర్ తెలుసుకోవచ్చు. ఎక్కుపెట్టిన బాణం కచ్చితంగా ఎక్కడ హిట్ చేస్తుందనే విషయాన్ని కూడా ఈ స్కోర్ రికార్డర్ చెబుతుంది. శిక్షణ సమయంలో ఈ స్కోర్ రికార్డర్స్ ద్వారా క్రీడాకారులు తమ ఎక్కు పొజిషన్ను ఇంప్రూవ్ తెలుసుకోవచ్చు.

3. విజన్-బేస్డ్ హార్ట్ రేట్ మెజర్మెంట్:

ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనే ఆటగాళ్ళ హార్ట్ విపరీతంగా కొట్టుకుంటుంది. దీనివల్ల వాళ్ళ పర్ఫామెన్స్ పై ప్రభావం పడవచ్చు. అయితే ఎక్కువగా ఆందోళన పడుతున్న క్రీడాకారులను విజన్-బేస్డ్ హార్ట్ రేట్ మెజర్మెంట్ టెక్నాలజీ గుర్తిస్తుంది. వారందరి కోసం ఒక మెడిటేషన్ యాప్ కూడా క్రియేట్ చేశారు. అనంతరం రియల్ లైఫ్ పోటీలలో ఎంత ప్రశాంతంగా ఉండాలో నేర్పించారు.

4. డీప్ లెర్నింగ్ విజన్ AI కోచ్:

ట్రైనింగ్ సమయంలోనూ క్రీడాకారులు ఎలా పర్ఫార్మ్ చేశారు అనేది తెలుసుకోవడానికి.. అన్ని ట్రైనింగ్ వీడియోలను చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ డీప్ లెర్నింగ్ విజన్ AI కోచ్ విశ్లేషణను సులభతరం చేస్తుంది. క్రీడాకారుల ట్రైనింగ్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఒక ఉపయోగకరమైన ఒక వీడియోని తయారు చేస్తుంది. అప్పుడు క్రీడాకారులు తమ పర్ఫామెన్స్ ని విశ్లేషించుకోవచ్చు.

5. కస్టమైజ్డ్ గ్రిప్:

విల్లుకు ఉండే పట్టును కూడా త్రీడీ టెక్నాలజీ సహాయంతో అద్భుతంగా తయారుచేసి కొరియన్ టీమ్ క్రీడాకారులకు ఇచ్చారు.

First published:

Tags: Hyundai, South korea, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు