హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: ఒలింపిక్ స్టేడియంలో 13 ఏళ్ల తర్వాత వినిపించిన జనగణమన గీతం.. ఉప్పొంగిన భారతీయుడి హృదయం

Tokyo Olympics: ఒలింపిక్ స్టేడియంలో 13 ఏళ్ల తర్వాత వినిపించిన జనగణమన గీతం.. ఉప్పొంగిన భారతీయుడి హృదయం

నీరజ్ చోప్రా (Image:Twitter)

నీరజ్ చోప్రా (Image:Twitter)

Tokyo Olympics: ఇవాళే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజు. మన దేశ జాతీయ గీతం జనగణమనను ఆయనే రాశారు. ఠాగూర్ పుట్టినరోజు నాడు ఒలింపిక్స్ స్టేడియంలో జనగణమన గీతాన్ని వినిపించిన ఘనత నీరజ్ చోప్రాకే దక్కుతుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇంకా చదవండి ...

  నీరజ్ చోప్రా... అథ్లెటిక్స్‌లో 100 ఏళ్ల కలను సాకారం చేసిన భరతమాత ముద్దుబిడ్డ. జావెలిన్ త్రోలో స్వర్ణపతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీరజ్ గురించే చర్చ జరుగుతోంది. బంగారు కొండ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు గెలిచిన గోల్డ్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. గత వందేళ్లలో అథ్లెటిక్స్‌లో వచ్చి తొలి పతకం. అభినవ్ బింద్రా తర్వాత గోల్డ్ గెలిచిన రెండో క్రీడాకారుడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏకైక స్వర్ణ పతకం. అంతేకాదు 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్ స్టేడియంలో భారత జాతీయ గీతం జనగణమన వినిపించింది. నీరజ్ చోప్రా పతకం తీసుకుంటున్న సమయంలో జనగణమన గీతం వినిపించడంతో టీవీల ముందున్న అందరూ నిలబడ్డారు. త్రివర్ణ పతాకం ఎగురుతుండగా.. జాతీయ గీతం వినిపిస్తుంటే.. ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక దేశభక్తుడికి ఇంత కంటే అద్భుత క్షణం ఇంకొకటి ఉంటుందా.. అని సోషల్ మీడియా వేదికగా అందరూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

  కాగా, ఇవాళే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజు. మన దేశ జాతీయ గీతం జనగణమనను ఆయనే రాశారు. ఠాగూర్ పుట్టినరోజు నాడు ఒలింపిక్స్ స్టేడియంలో జనగణమన గీతాన్ని వినిపించిన ఘనత నీరజ్ చోప్రాకే దక్కుతుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఠాగూర్‌కు ఘనంగా నివాళి అర్పించావంటూ కొనియాడుతున్నారు. అంతకు ముందు 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో జనగణమన గీతం వినిపించింది. షూటింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణపతకం గెలిచిన సందర్భంగా మన జాతీయ గీతాన్ని వినిపించారు. మళ్లీ ఇన్నాళ్లు ఆ క్షణం రావడంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు.

  టోక్యోలో ఒలింపిక్స్ చివరి రోజు భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో ఏకంగా 87.58 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించాడు. ఇంకెవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక అంతకు ముందు రెజ్లింగ్ బజ్‌రంగ్ పునియా కాంస్య పతకం గెలిచాడు. అంటే చివరి రోజు భారత్‌కు రెండు పతకాలు వచ్చాయన్న మాట. మొత్తంగా టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు దక్కాయి. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.

  ఇవి కూడా చదవండి:

  Neeraj Chopra: వందేళ్ల భారతీయుల కల నెరవేర్చిన నీరజ్ చోప్రా ఎవరు.. ?

  Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత పతక వీరులు వీళ్లే.. ఎవరు ఏ మెడల్స్ గెలిచారు?

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Olympics, Sports, Tokyo, Tokyo Olympics

  ఉత్తమ కథలు