టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) మరో రెజ్లర్ (Wrestler) పతకంపై ఆశలు పుట్టిస్తున్నాడు. ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో రెజ్లర్ భజరంగ్ పునియా (Bajrang Punia) తన అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. ఇరానియన్ రెజ్లర్ ఘియాసి చెకాను పలుమార్లు పిన్ డౌన్ చేశాడు. తొలి రౌండ్‌లో పునియా ఒక పాయింట్ వెనుకబడ్డాడు. ఇరానియన్ రెజ్లర్ ఎటాక్స్‌కు మంచి డిఫెన్స్‌ను పునియా ప్రదర్శించాడు. కానీ పాయింట్లు మాత్రం సాధించలేకపోయాడు. ఇర రెండో రౌండ్ ఆరంభంలో కాస్త ఒత్తిడితో కనిపించిన పునియా.. తర్వాత పుంజుకున్నాడు. అయితే ఇరానియన్ రెజ్లర్‌ను పిన్ డౌన్ చేసి పునియా పాయింట్లు సాధించాడు. దీంతో పునియా ఫాల్ ద్వారా విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. ప్రత్యర్థిని కింద పడేసి రెండు భుజాలు మ్యాట్‌కు తగిలేలా నొక్కి పెట్టడాన్ని ఫాల్ అంటారు. బాక్సింగ్‌లో నాకౌట్ లాంటిదే రెజ్లింగ్‌లో ఫాల్. ఇక సెమీఫైనల్‌లో పునియా అజర్‌బైజాన్‌కు చెందిన హాజీ అలాయేవ్‌తో తలపడనున్నాడు.
అంతకు ముందు భజరంగ్ పునియా శుక్రవారం ఉదయం 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కిర్గిస్తాన్‌కు చెందిన ఎర్నజర్ అక్మటాలెవ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో పునియా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో తప్పక పతకం తెస్తాడని భజరంగ్ పునియాపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చాంపియన్ ప్రదర్శన చేశాడు. తొలి రౌండ్‌లో భజరంగ్ ముందే పాయింట్ సాధించాడు. ఏకంగా 3-1 ఆధిక్యంతో దూసుకొని వెళ్లాడు. ఆ తర్వాత రౌండ్లో కిర్గిస్తాన్ రెజ్లర్ గట్టి పోరాటం చేశాడు. ఒక్కో పాయింట్ సాధిస్తూ చివరకు 3-3తో స్కోర్ సమం చేశాడు. అయితే రిఫరీలు పునియాను విజేతగా ప్రకటించాడు. స్కోరింగ్ మూవ్స్ ఎక్కువగా పునియా చేయడంతో అతడిని విజయం వరించింది. కిర్గిస్తాన్ రెజ్లర్ స్కోరింగ్ మూవ్స్ కంటే పునియాను రింగ్ నుంచి బయటకు నెట్టేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో రిఫరీలు పునియానే విజేతగా ప్రకటించారు.
BAJRANG ADVANCES TO SEMIFINAL!!#IND @BajrangPunia advances to the semifinal of Men’s freestyle 65 Kg by winning by fall against #IRI Morteza Cheka Ghiasi
Watch this space for updates on #Olympics #Tokyo2020#Cheer4India pic.twitter.com/Kzi5xPknbl
— SAIMedia (@Media_SAI) August 6, 2021
పునియా మరో మ్యాచ్ గెలిస్తే స్వర్ణం లేదా రజతంలో ఏదో ఒక పతకం ఖాయం చేసుకుంటాడు. లేదంటే కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics, Wrestling