ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) హోరాహోరీగా సాగుతున్నాయ్. ప్రతి అథ్లెట్ పతకం సాధించడానికి కష్టపడుతున్నారు. పతకం సాధించి తమ దేశాలకు పేరు ప్రఖ్యాతులు తేవడానికి శ్రమిస్తున్నారు. అలాంటి అథ్లెట్స్ కోసం ఆయా దేశాలు భారీగానే క్యాష్ ప్రైజ్ లు ప్రకటించాయ్. ఆ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.
ఆస్ట్రేలియా - కెనడా : ఈ రెండు దేశాలు తమ అథ్లెట్లకు ఒకే విధంగా క్యాష్ ప్రైజ్ ను ప్రకటించాయ్.
గోల్డ్ మెడల్ : 15 వేల నుంచి 16 వేల డాలర్లు
సిల్వర్ మెడల్ : 11 వేల నుంచి 12 వేల డాలర్లు
బ్రాంజ్ మెడల్ : 7 వేల నుంచి 8 వేల డాలర్లు
అమెరికా : పతకాల పట్టికలో అమెరికా దాదాపు ఫస్ట్ స్థానానికి చేరువైంది. టోక్యో ఒలింపిక్స్ లో అమెరికా అథ్లెట్ల దూకుడు కొనసాగుతోంది.
గోల్డ్ మెడల్ : 37 వేల డాలర్లు
సిల్వర్ మెడల్ : 22 వేల డాలర్లు
బ్రాంజ్ మెడల్ : 15 వేల డాలర్లు
జపాన్ - బ్రెజిల్ : ఈ రెండు దేశాలు కూడా తమ అథ్లెట్లకు ఒకే విధంగా క్యాష్ ప్రైజ్ ను ప్రకటించాయ్
గోల్డ్ మెడల్ : 45 వేల నుంచి 49 వేల డాలర్లు
సిల్వర్ మెడల్ : 18 వేల నుంచి 29 వేల డాలర్లు
బ్రాంజ్ మెడల్ : 9 వేల నుంచి 20 వేల డాలర్లు
భారత్ : మన దేశం కూడా పతకాలు సాధించే అథ్లెట్లకు భారీగానే నజరానా ప్రకటించింది.
గోల్డ్ మెడల్ : 75 లక్షల రూపాయలు (100,834 డాలర్లు)
సిల్వర్ మెడల్ : 40 లక్షల రూపాయలు (53,778 డాలర్లు)
బ్రాంజ్ మెడల్ : 25 లక్షల రూపాయులు (33,611 డాలర్లు)
హంగేరి : హంగేరి దేశం తమ అథ్లెట్లకు భారీగానే నగదును ప్రకటించింది.
గోల్డ్ మెడల్ : 1,68,000 డాలర్లు
సిల్వర్ మెడల్ : 1,26,000 డాలర్లు
బ్రాంజ్ మెడల్ : 96 వేల డాలర్లు
ఇటలీ - మలేసియా : ఇటలీ, మలేసియా దేశాలు కూడా తమ అథ్లెట్లకు భారీగా ప్రైజ్ మనీని ప్రకటించాయ్.
గోల్డ్ మెడల్ : 2,13,000 నుంచి 2,36,000 డాలర్లు
సిల్వర్ మెడల్ : 71,000 నుంచి 107,000 డాలర్లు
బ్రాంజ్ మెడల్ : 24,000 నుంచి 71,000 డాలర్లు
కజకిస్తాన్ : చిన్న దేశమే అయినా.. తమ అథ్లెట్లను ప్రోత్సాహించే విధంగా భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది కజకిస్తాన్.
గోల్డ్ మెడల్ : 2,50,000 డాలర్లు
సిల్వర్ మెడల్ : 1,50,000 డాలర్లు
బ్రాంజ్ మెడల్ : 75,000 డాలర్లు
సింగపూర్ : ఇక, అన్ని దేశాల కన్నా అత్యధిక క్యాష్ ప్రైజ్ ను ప్రకటించింది సింగపూర్. గోల్డ్ మెడల్ సాధించే అథ్లెట్ కు మన కరెన్సీలో దాదాపు 6 కోట్ల రూపాయల వరకు ప్రైజ్ మనీ అందించనుంది.
గోల్డ్ మెడల్ : 7,37,000 డాలర్లు
సిల్వర్ మెడల్ : 3,69,000 డాలర్లు
బ్రాంజ్ మెడల్ : 1,84,000 డాలర్లు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tokyo Olympics