TOKYO OLYMPICS HOCKEY TEAM WON AGAINST SPAIN MENS TEAM BOUNCE BACKED AFTER DEFEAT AGAINST AUSTRALIA JNK
Tokyo Olympics: హాకీలో స్పెయిన్‌పై ఘనవిజయం సాధించిన టీమ్ ఇండియా.. పూల్ మ్యాచ్‌లో విజయం
స్పెయిన్‌పై ఘన విజయం సాధించిన హాకీ పురుషుల జట్టు
ఆస్ట్రేలియాపై చిత్తుగా ఓడిన భారత హాకీ జట్టు బలంగా పుంజుకున్నది. పూల్ ఏలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లె 3-0తో గెలుపొంది క్వార్టర్స్‌పై ఆశలు సజీవంగా ఉంచుకున్నది.
ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) భారత పురుషుల హాకీ జట్టు (Team India) (Men's Hockey) అద్భుతమైన విజయాన్ని సాధించింది. పూల్‌లో భాగంగా స్పెయిన్‌తో (Spain) జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో ఓడించింది. అంతకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 1-7తో ఘోర పరాజయన్ని మూట గట్టుకున్న మెన్ ఇన్ బ్లూ.. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా పుంజుకున్నది. మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు గత మ్యాచ్ ఒత్తిడిన పూర్తిగా అధిగమించింది. ఆట ప్రారంభమైన దగ్గర నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 14వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్ తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత మరో నిమిషానికే రూపిందర్ పాల్ సింగ్ రెండో గోల్ కొట్టి భారత జట్టుకు మంచి ఆధిక్యాన్ని అందించాడు. ఇక రెండో అర్ద భాగంలో రూపిందర్ సింగ్ మరోసారి తన ప్రతిభతో 51వ నిమిషంలో గోల్ అందించి భారత జట్టు ఆధిక్యాన్ని 3-0కు తీసుకొని వెళ్లాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని వృధా చేసుకున్నది. అందే కాకుండా టర్ఫ్‌పై పదే పదే తప్పులు చేస్తూ భారత్‌పై ఆధిక్యాన్ని ప్రదర్శించలేక పోయింది. మరోవైపు భారత జట్టు మాత్రం పదే పదే గోల్ పోస్టులపై దాడి చేస్తూ స్పెయిన్‌ను ఒత్తిడిలోకి నెట్టేసింది.
భారత జట్టు ఒలింపిక్స్ పూల్ ఏ లో తొలి మ్యాచ్ న్యూజీలాండ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌ను 3-2తో గెలిచిన టీమ్ ఇండియా.. ఆస్ట్రేలియాపై మాత్రం 1-7 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అలాంటి ఘోర ఓటమి నుంచి కోలుకున్న భారత్ స్పెయిన్‌పై 3-0తో ఘన విజయం సాధించింది. ఇక పూల్ ఏలో తర్వాతి మ్యాచ్‌లో అర్జంటీనాతో.. ఆ తర్వాత జపాన్‌తో భారత జట్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. ఈ రెండింటిలో కనీసం ఒక మ్యాచ్ గెలిస్తే భారత జట్టు క్వార్టర్స్ ఫైనల్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే డిఫెండింగ్ చాంపియన్ అయిన అర్జెంటీనాను ఓడించడం అంత సులువేమీ కాదు. మరోవైపు జపాన్ను స్వదేశంలో ఓడించడం కూడా చాలా కష్టంతో కూడిన వ్యవహారమే. అయితే భారత జట్టు పుంజుకున్న తీరు చూస్తుంటే తప్పకుండా మ్యాజిక్ చేస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
"Better result today, but a lot of things to work on from an improvement perspective."
మరోవైపు పూల్ ఏలో ఉన్న భారత మహిళా జట్టు సోమవారం జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన జర్మనీ 2-0 తేడాతో భారత్‌పై విజయం సాధించింది. అంతకు ముందు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు ఓడిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో మ్యాచ్‌లు ఓడిన భారత జట్టు బుధవారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉన్నది. వరుసగా గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లు గెలిస్తేనే భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.