హోమ్ /వార్తలు /క్రీడలు /

Oksana Chusovitina: ఈమెను చూసి అందరూ నేర్చుకోవాలి.. ఈ వయసులోనూ ఒలింపిక్స్‌లో అద్భుతాలు

Oksana Chusovitina: ఈమెను చూసి అందరూ నేర్చుకోవాలి.. ఈ వయసులోనూ ఒలింపిక్స్‌లో అద్భుతాలు

ఒక్సనా చుసోవిటిన

ఒక్సనా చుసోవిటిన

Oksana Chusovitina: ఉజ్బెకిస్థాన్​కు చెందిన ఒక్సనా చుసోవిటినా.. తన కెరీర్​లో సోవియట్ యూనియన్​, జర్మనీ, ఉజ్బెకిస్థాన్ తరఫున ఒలింపిక్స్​లో ప్రాతినిధ్యం వహించారు. 1975 జూన్ 19న జన్మించిన ఆమె 1988లోనే జిమ్నాస్టిక్స్ కెరీర్​ ప్రారంభించారు

ఇంకా చదవండి ...

సాధించాలన్న పట్టుదల ఉంటే వయసు అడ్డుకాదని ఓ అథ్లెట్ నిరూపించారు. విశ్వక్రీడల్లో సత్తాచాటాలన్న ధ్యేయాన్ని తీర్చుకునేందుకు ఎనిమిదోసారి కూడా ఒలింపిక్స్​లో అడుగుపెట్టారు. 46 సంవత్సరాల వయసులోనూ అత్యంత కష్టమైన జిమ్నాస్టిక్స్​లో టోక్యో ఒలింపిక్స్​లో పోటీ పడ్డారు. ఆమె పేరే ఒక్సానా చుసోవిటినా. ఉజ్బెకిస్థాన్​కు చెందిన ఈ అథ్లెట్​ ఒలింపిక్స్ ప్రయాణం 1992లో మొదలైంది. ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న ఒలిపిక్స్​లోనూఒక్సానా పాల్గొన్నారు. అయితే, ఆమె అద్బుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఫైనల్స్​కు చేరలేకపోయారు.గ్రూప్​ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే అథ్లెట్లంతా ఆమెకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అందరూ నిలబడి ఆమెను చప్పట్లతో అభినందించారు. తన చివరి ఒలింపిక్స్​లో ఒక్సానా చుసోవిటినా పతకం సాధించలేకపోయినా.. ఆమె పోరాటం మాత్రం అందరిలో స్ఫూర్తి నింపారు. గ్రూప్​ దశలో ఎనిమిదో స్థానం లోపల నిలువలేక నిష్క్రమించే సమయంలో ఒక్సానా కన్నీరు పెట్టుకున్నారు. అయితే తన ప్రయాణంలో ఎంతో మంది మద్దతుగా నిలిచారని, అందరికీ ధన్యవాదాలు అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

1992 బార్సిలోనా ఒలింపిక్స్​లో మొదటిసారి అడుగుపెట్టారు ఒక్సనా. అప్పుడు సోవియట్ టీమ్ తరఫున ఆడగా ఆ టీమ్​స్వర్ణం గెలుచుకుంది. జిమ్నాస్టిక్స్ కెరీర్ ప్రారంభించాక ఒక్సానా 17 ప్రపంచ చాంపియన్​షిప్ టోర్నీల్లో ఏకంగా 11 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది.ఆమె పేరిట జిమ్నాస్టిక్స్​లో ప్రత్యేకమైనమూవ్స్ కూడా ఉన్నాయి. అవి, ముందుగా ఆమె అనుకరించడంతో వారిటి ఒక్సానా పేరు పెట్టారు. కాగా,2000 సిడ్నీ ఒలింపిక్స్​ ఒక్సానాకు చివరి ఒలింపిక్స్ అని అందరూ అనుకున్నారు. అప్పటికే ఆమెకు బిడ్డపుట్టడంతో ఒక్సానాకెరీర్​ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్సానా వరుసగా ఒలింపిక్స్​లో పాల్గొంటూనే ఉంది. వాస్తవానికి ఒక్సానాకుబిడ్డ పుట్టడంతో ఒలింపిక్స్​కు ఇక దూరంగా ఉండాలని భావించింది.అయితే 2002లో తన కుమారుడు అలిషర్​ లుకేమియా బారిన పడ్డాడు. అయితే అతడికి చికిత్స చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమె మళ్లీ జిమ్నాస్టిక్స్ బరిలోకి దిగింది. అంతటి దు:ఖంలోనూఒక్సానా జిమ్నాస్టిక్ వాల్ట్​లోకి దిగిప్రపంచ టోర్నీల్లో సత్తాచాటింది.2008 బీజింగ్ ఒలింపిక్స్​లో రజతం సాధించి అదరగొట్టింది. వ్యక్తిగత విభాగంలో ఆమెతొలి ఒలింపిక్స్ పతకం గెలుచుకొని అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. కాగా ఒలింపిక్స్ పూర్తయిన కొన్ని రోజులకేఆమె కుమారుడు అలిషర్​కు లుకేమియా పూర్తిగా తగ్గిపోయింది.

ఉజ్బెకిస్థాన్​కు చెందిన ఒక్సనా చుసోవిటినా.. తన కెరీర్​లో సోవియట్ యూనియన్​, జర్మనీ, ఉజ్బెకిస్థాన్ తరఫున ఒలింపిక్స్​లో ప్రాతినిధ్యం వహించారు. 1975 జూన్ 19న జన్మించిన ఆమె 1988లోనే జిమ్నాస్టిక్స్ కెరీర్​ ప్రారంభించారు. మొత్తంగా సుదీర్ఘ కెరీర్​తో ఎంతో మంది అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Sports, Tokyo, Tokyo Olympics

ఉత్తమ కథలు